Saturday, May 18, 2024
- Advertisement -

రాహుల్ వాక్ ఔట్.. ఆర్మీ లో హై టెన్షన్..!

- Advertisement -

రక్షణ రంగ వ్యవహారాలపై ఏర్పాటైన పార్లమెంట్ కమిటీ​ సమావేశం నుంచి రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్​కు చెందిన సభ్యులు వాకౌట్​ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జాతీయ భద్రత, రక్షణ బలగాలకు మెరుగైన ఆయుధ పరికరాల సమకూర్చడం వంటి కీలకమైన అంశాలపై చర్చించకుండా… జవాన్ల యూనిఫాంపై చర్చలు జరుపుతూ.. కమిటీ సమయాన్ని వృధా చేస్తోందని​ రాహుల్ ఆరోపించినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి.

త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్​ సమక్షంలో సైనికుల యూనిఫాంపై చర్చించగా.. రాహుల్​ జోక్యం చేసుకుని రక్షణ రంగాల బలోపేతం, జాతీయ భద్రత చర్చించాలని కోరారు. చైనా దురాక్రమణ, రక్షణ దళాలకు మెరుగైన ఆయుధాలు వంటి అంశాలనూ ప్రస్తావించారు. ప్యానెల్​ ఛైర్మన్​ జుయల్​ ఓరం అనుమతించని నేపథ్యంలో రాహుల్​ సహా ఇతర కాంగ్రెస్​ సభ్యులు వాకౌట్​ చేశారు” అని అధికార వర్గాలు తెలిపాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -