Thursday, May 16, 2024
- Advertisement -

కాంగ్రెస్‌కు షాకింగ్‌ న్యూస్‌…. పార్టీకీ మెగా గుడ్‌బాయ్‌…?

- Advertisement -

సినీనటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నారా..? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానమే వినపడుతోంది. సినీ రంగంలో రారాజుగా వెలిగిన చిరు త‌ర్వాత ప్ర‌జారాజ్యం పార్టీని స్థాపించాడు. 2008లో స్థాపించ‌న ప్ర‌జారాజ్య అధికారాన్ని పొందలేక, ఆపై పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన మెగాస్టార్ త‌ర్వాత కేంద్ర మంత్రిగా, రాజ్య‌స‌భ స‌భ్యునిగా ప‌ద‌వులు నిర్ణ‌యించారు.

విభ‌జ‌న త‌ర్వాత అడ్ర‌స్ లేకుండా పోయిన త‌ర్వాత పార్టీకీ దూరంగా ఉంన్న చిరంజీవి ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. తన 150వ చిత్రంగా ‘ఖైదీ నం. 150’తో వచ్చిన ఆయన, ప్రస్తుతం ‘సైరా’ చేస్తున్నారు. ఆపై కొన్ని చిత్రాలను వరుసగా చేయాలని నిర్ణయించుకున్నారు.

ఇటీవల చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వ కాలపరిమితి ముగియగా.. దాన్ని పునరుద్ధరించుకోలేదు. దీంతో ఆయన ఆ పార్టీకి దూరమైనట్లేనని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున పార్టీలో క్రియాశీలకంగా ఉండాలని ఇటీవల రాహుల్‌గాంధీ.. చిరంజీవిని కోరినట్లు తెలుస్తోంది. దీనికి ఆయన నుంచి స్పందన లేనట్లు సమాచారం. దీంతో ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఇక దూరమైనట్లేనని భావిస్తున్నారు.

అంతేకాకుండా ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉండి.. వచ్చే ఎన్నికల్లో జనసేన పరిస్థితిని అంచనా వేసి ఆ తర్వాత తమ్ముడి పార్టీలోకి అడుగుపెట్టాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమైనట్టేనని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -