Saturday, April 20, 2024
- Advertisement -

సంపత్​ రాజ్​ అరెస్ట్.. కారణం బెంగళూరు అల్లర్లే..!

- Advertisement -

కర్ణాటక బెంగళూరు అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్​ మాజీ మేయర్​ సంపత్​ రాజ్​ను పోలీసులు అరెస్టు​ చేశారు. ఇటీవల కరోనాతో బాధపడుతూ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన… కొందరి సాయంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారు.

సంపత్ తప్పించుకోవడానికి సహకరించిన రియాజుద్దీన్​ సహా మరో కాంగ్రెస్ కార్పోరేటర్​ అబ్దుల్​ రాకీబ్​ జాకీర్​ను కూడా బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. సంపత్​కు మైసూర్​లోని నాగరహోళిలో జాకీర్​ ఆశ్రయం కల్పించినట్లు పోలీసులు తెలిపారు. జాకీర్​కు కూడా బెంగళూరు అల్లర్లతో సంబంధం ఉన్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది ఆగస్టు 11న నగరంలో జరిగిన అల్లర్లతో సంపత్​కు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆ అల్లర్లలో దేవరహళ్లి, కడుగొండనాహళ్లి పోలీసు స్టేషన్లను​ తగలబెట్టారు ఆందోళనకారులు. ఈ హింసాత్మక అల్లర్లలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

మన మాజీ ప్రధాని పై ఒబామా రాతలు..!

ట్రంప్- బైడెన్ ఒకే దాటి పై కీలక స్పందన..!

మళ్లీ అక్కడ కరోనా డేంజర్ బెల్!

డీఆర్​డీఓ మరో భారీ ప్లాన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -