Friday, April 19, 2024
- Advertisement -

డీఆర్​డీఓ మరో భారీ ప్లాన్..!

- Advertisement -

భారత రక్షణ, పరిశోధన సంస్థ(డీఆర్​డీఓ) రూపొందించిన వాటిలో అత్యంత శక్తిమంతమైంది బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆపరేషన్​ నిర్వహించగల సామర్థ్యం ఉండటం దీని ప్రత్యేకత. గతంలో 298 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి సామర్థ్యాన్ని.. ఇటీవలే 450కి.మీకు పెంచింది డీఆర్​డీఓ.

ప్రస్తుతం చైనా, పాకిస్థాన్​తో సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో తన సత్తా ఏంటో శత్రు దేశాలకు చూపాలని భావిస్తోంది భారత్​. ఇందులో భాగంగానే హిందూ మహాసముద్రంలో ఈ నెల చివరి వారంలో బ్రహ్మోస్ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణితో పలు పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. భారత త్రివిధదళాల సారథ్యంలో వీటిని చేపట్టనుంది.

నవంబర్​ నెల చివరి వారంలో ఈ ప్రయోగాలు జరుగుతాయని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫలితంగా బ్రహ్మోస్​ సూపర్​సోనిక్ క్రూజ్ క్షిపణి వ్యవస్థ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని పేర్కొన్నాయి.

స్పేస్​ ఎక్స్ వాయిదా..!

ఉగ్రవాదులు ఏక్కడ దాక్కున్నా.. ఏరి పారేస్తాం : ప్రధాని మోదీ

చైనా పై యుద్ధం ప్రకటించిన అమెరికా?

భారత్ నుంచి చైనాకు ఎగుమతులు కట్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -