తాము అభివృద్ధి చేస్తున్న కరోనా టీకా.. 94.5శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు అమెరికా సంస్థ మోడెర్నా చేసిన ప్రకటనపై అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు. తన హయాంలోనే ఇలాంటి గొప్ప ఆవిష్కరణలు జరిగాయని గుర్తుంచుకోవాలన్నారు.
మోడెర్నా ప్రకటనపై 2020అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్ స్పందించారు. ఇలాంటి ప్రకటనలు భవిష్యత్తుపై ఆశను పెంచుతాయన్నారు.
మోడెర్నా ప్రకటనను ఓ ఆశాజనకమైన వార్తగా అభివర్ణించారు భారతీయ అమెరికన్, కరోనా కట్టడికి బైడెన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్లో కీలక సభ్యుడు డా. వివేక్ మూర్తి.అమెరికాలో ఇప్పటికే ఫైజర్ టీకా 92 శాతం సమర్థంగా పనిచేస్తుందని ఇటీవల వెల్లడించగా.. తాజాగా మోడెర్నా కూడా పోటీలో నిలిచింది. ఇటీవలే మూడోదశ ట్రయల్స్ ప్రారంభించగా.. సంస్థ అధ్యయనంలో భాగంగా 94.5% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమికంగా గుర్తించింది.
జో బైడెన్ పక్కన భారతీయ కూటమి..!
