Thursday, May 16, 2024
- Advertisement -

గుంటూరులో జగన్ యాత్ర…. టిడిపి బీసీ నాయకుల భారీ చేరికలు

- Advertisement -

సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో హైదరాబాద్‌పైనే దృష్టిపెట్టి మొత్తం రాష్ట్రానికి అన్యాయం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం సీమాంధ్ర ప్రాంతాన్ని వదిలేసి గుంటూరు, కృష్ణా జిల్లాలపైన మాత్రం దృష్టి పెడుతున్నాడన్న విషయం కంటికి కనిపిస్తున్న నిజం. బాబుతో పాటు టిడిపి నాయకులందరూ కూడా ఈ సారి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టిడిపి స్వీప్ ఖాయమని నమ్ముతున్నారు. అలాంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో జగన్ ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న భారీ ప్రజా స్పందన టిడిపి నేతల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తోంది. కడప జిల్లాలో జగన్‌కి వచ్చిన స్థాయి స్పందన గుంటూరు జిల్లాలో కూడా వస్తుండడం రాజకీయ విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది.

ఇక భారీ ప్రజాస్పందన విషయం పక్కనపెడితే టిడిపి నుంచి వైకాపాలోకి నాయకుల చేరికలు కూడా బాబుకు కునుకు లేకుండా చేస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీలోకి జంపింగులు కామన్ వ్యవహారమే. ఆర్థిక లాభాలతోపాటు ఇతర లాభాలు ఎన్నో ఉంటాయి కాబట్టి. కానీ అధికార పార్టీలో సత్తెనపల్లి నియోజక వర్గ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నేత వైకాపాలో చేరడం మాత్రం 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అని నాయకులు కూడా ఏ స్థాయిలో నమ్ముతున్నారు అన్న విషయం తెలియచేస్తోంది. ఇక తాజాగా టిడిపిలో ప్రజా బలం ఉన్న నాయకులుగా పేరున్న టిడిపి బిసీ నాయకులు అనుచరులతో కలిసి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. తెదేపా బిసి నాయకులు గోళ్ళ శివ శంకర్ యాదవ్, గంపా నరసింహారావులు వైకాపాలో చేరారు. ప్రతి రాజకీయ పార్టీకి కూడా సంస్థాగతంగా బాగా పట్టున్న కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి. ఇప్పుడు టిడిపికి అలాంటి స్థాన బలం ఉన్నచోటనే జగన్ పాదయాత్రకు భారీగా ప్రజా స్పందన దక్కుతుండడం….అధికారంలో ఉన్న టిడిపి పార్టీ నాయకులు అధికారంలేని వైకాపాలో చేరుతూ ఉండడం మాత్రం 2019ఎన్నికలకు సంబంధించి ప్రజల మూడ్‌ని తెలియచేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -