Saturday, May 18, 2024
- Advertisement -

షాకింగ్ః జగన్‌ని సిఎం చేయమని చేసిన యాగంలో పాల్గొన్న టిడిపి సీనియర్ లీడర్

- Advertisement -

2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావాలని, వైఎస్ జగన్ సిఎం అవ్వాలని కోరుతూ వైకాపా నేత భారీ యాగం తలపెట్టాడు. ఇది మామూలు విషయమే అయినా ఆ యాగానికి టిడిపి సీనియర్ మోస్ట్ లీడర్ హాజరవడం మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అసలే ఈ మధ్య టిడిపి సీనియర్ నాయకులను కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నాడు చంద్రబాబు. చాలా మంది టిడిపి నాయకులే చంద్రబాబు, లోకేష్‌ల అవినీతి, అక్రమ వ్యవహారాల గురించి మోడీకి సమాచారం చేరవేస్తున్నారని చంద్రబాబు అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా జగన్‌ని సిఎం చేయమని కోరుతూ గుడివాడ వైకాపా ఎమ్మెల్యే కొడాలి నాని నిర్వహించిన యాగానికి టిడిపి సీనియర్ నాయకుడు హాజరవడం టిడిపి అధినేతలో గుబులు రేపుతోంది.

పిన్నమనేని వెంకటేశ్వరరావు………..ఈ రాజకీయ నాయకుడి పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సార్లు ప్రముఖంగా వినిపించింది. మంత్రిగా కూడా చేశాడు. ఎన్టీఆర్ నుంచీ చాలా మంది నాయకులతో పనిచేసిన అనుభవం ఆయన సొంతం. టిడిపికి హార్డ్ కోర్ అభిమాని. టిడిపిలో సీనియర్ మోస్ట్ నాయకుడు. అలాంటి టిడిపి నాయకుడు 2019 ఎన్నికల్లో వైకాపా గెలవాలని, వైఎస్ జగన్ సిఎం అవ్వాలని గుడివాడ వైకాపా ఎమ్మెల్యే నిర్వహించిన శతచండీ యాగానికి స్వయంగా హాజరవ్వడం……యాగంలో తాను కూడా పూజలు చెయ్యడం, యాగం సక్సెస్ అవ్వడానికి తనవంతు సాయం చేయడంలాంటివి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉన్న కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులు కూడా చంద్రబాబుకు హ్యాండ్ ఇస్తూ వైకాపాలో చేరుతూ ఉండడం టీడీపీ అధినేతలో గుబులు పుట్టించే విషయమే అనడంలో సందేహం లేదు. ఎనభై శాతం పైగా ప్రజలు తన పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చేది నేనే అని చంద్రబాబు, లోకేష్‌లు గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు కానీ టిడిపి స్థానికి నేతల నుంచీ సీనియర్ నేతల వరకూ ఎవ్వరూ కూడా నమ్మడంలేదు. స్వయంగా యనమల రామకృష్ణుడు లాంటి నాయకుడు కూడా రాజ్యసభ సభ్యుడిగా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇతర సీనియర్ నాయకులు కొంతమంది వైకాపాలో చేరే ప్రయత్నం చేస్తూ ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. అలాగే జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా టిడిపి కంటే వైకాపాకు పది శాతం పైగా ఓట్ల శాతం తేడా ఉందని, 2019లో వైకాపా ఘన విజయం ఖాయమని చెప్తూ ఉండడం కూడా టిడిపి అధిష్టానానికి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -