Friday, May 17, 2024
- Advertisement -

రేవంత్‌రెడ్డికి పెరుగుతున్న మద్దతు….

- Advertisement -

తెలంగాణాలో మ‌రో ఉప ఎన్నిక జ‌ర‌గ‌బోతోందంటూ వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. టీఆర్ఎస్ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి రాజీనామా ఖాలీ కాబోతున్న న‌ల్గొండ లోక్‌స‌భ స్థానానికి ఉప ఎన్నిక జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఇదే జ‌రిగితె టీఆర్ఎస్‌ను దెబ్బ కొట్టేందుకు పార్టీల‌న్ని ఒక‌ట‌వుతున్నాయి. ఉప ఎన్నిక అనివార్య‌మ‌యితె టీడీపీ త‌రుపున రేవంత్‌రెడ్డిని బ‌రిలోకి దింపాల‌ని నేత‌లు భావిస్తున్నారు. రేవంత్ అయితేనే ప్రత్యర్థులను సరిగ్గా ఎదుర్కోగలరని జిల్లా పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు‌ అదే పట్టును తిరిగి కొనసాగించాలని, అందుకు రేవంత్ రెడ్డే సరైన వ్యక్తి అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గంలోని సామాజిక వర్గాలు కూడా రేవంత్‌‌కు మద్దతుగా నిలుస్తాయని అంటున్నారు. ఇక్కడి నుంచి కనుక రేవంత్ బరిలోకి దిగితే విజయం తథ్యమని, టీఆర్ఎస్‌ పతనం ఖాయమని చెబుతున్నారు. అంతేకాక ఇతర పార్టీలు కూడా ఆయనకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి బరిలోకి దిగాలంటూ రేవంత్‌పై పార్టీ నేతలు వత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అధిష్ఠానానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు.

మ‌రో వైపు టీఆర్ఎస్‌లోని అసంతృప్తులుకూడా రేవంత్ రెడ్డికి మ‌ద్ద‌తు తెల‌పె అవ‌కాశాలు ఉన్నాయంటున్నారు. సీఎం కేసీఆర్‌కు చెక్ పెట్టేందుకు అన్ని పార్టీలు ఏక‌తాటిమీద‌కు రావాల‌ని చూస్తున్నాయి. ఇది జ‌రుగుతుందా అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -