Friday, May 17, 2024
- Advertisement -

గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్ సింగ్ కాలేడు ఉత్త‌మ్‌పై మంత్రి కేటీఆర్ సెటైర్‌

- Advertisement -

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ, తెలంగాణా పీసీసీ ఛీఫ్ ఉత్త‌మ్ కుమారెడ్డిపై మంత్రి కేటీఆర్ విరుచుకు ప‌డ్డారు. రాహుల్‌గాంధీ సొంత నియోజకవర్గం అమేథీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. ఎస్పీ నేత అఖిలేష్ సింగ్ యాదవ్ మద్దతు లేనిదే అమేథీలో రాహుల్ గాంధీ గెలిచే పరిస్థితి లేదని ఎద్దేవ చేశారు.

ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, విపక్షాలకు డిపాజిట్లు కూడా రాలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను జనాలు తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు. తెంగాణా మొత్తం టీఆర్ఎస్ వెంటే ఉంద‌న్నారు.

ప్రగతి నివేదన సభకు లక్షలాది మంది తరలివచ్చారు. ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ నేతలను తిట్టనందుకు వాళ్లు బాధపడుతున్నారన్నారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరించేందుకే ప్రగతి నివేదన సభ పెట్టినమన్నారు. ప్రగతి నివేదన సభలో కాంగ్రెస్ నేతలను తిట్టనందుకు వాళ్లు బాధపడుతున్నారన్నారు.

కామారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తాచాటామన్నారు. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించిందన్నారు. నారాయణఖేడ్, పాలేరు కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచిందంటే ప్రజలు ఎటువైపు ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్‌ఎస్‌కే పట్టం కడుతున్నారు. రాహుల్‌గాంధీ వస్తే తాము భయపడుతమా..? అని కేటీఆర్ అన్నారు.

కాంగ్రెస్‌లో అందరి కుటుంబాలు రాజకీయాల్లో ఉండొచ్చు..కానీ సీఎం కేసీఆర్ కుటుంబం ఉండకూడదా అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ ను ఓడించేంత వరకు గడ్డం తీయనని అంటున్నారని… గడ్డం పెంచిన ప్రతివాడూ గబ్బర్ సింగ్ కాలేరని ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ను జనాలు తిరస్కరిస్తున్నా ఆ పార్టీ నేతలకు బుద్ధి రావడం లేదని ఎద్దేవా చేశారు.

రైతుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. 24 గంటల పాటు రైతులకు కరెంట్ ను అందిస్తున్నామని చెప్పారు. ప్రగతి నివేదన సభపై విపక్షాలు చేస్తున్న విమర్శలు పసలేనివని అన్నారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేస్తం. ఎన్నికల్లో ఖచ్చితంగా 100 సీట్లు తెలుస్తం. కాంగ్రెస్ కంచుకోట బద్దలు కొడుతం. మళ్లీ సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -