Saturday, May 18, 2024
- Advertisement -

‘పప్పు’ అంటూ అదరిపోయే పంచ్ పేల్చిన కెటీఆర్….. లోకేష్‌కి సౌండ్ ఉంటుందా?

- Advertisement -

‘పప్పు’ అంటూ కెటీఆర్ పేల్చిన సెటైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ట్విట్టర్‌ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగించే తెలుగు నాయకుల్లో కెటీఆర్ ఒకడు. చాలా సందర్భాల్లో కెటీఆర్ ట్విట్టర్ కామెంట్స్‌కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కూడా ‘పప్పు’ అంటూ కెటీఆర్ పేల్చిన ఓ సెటైర్ అదిరిపోయిందన్న రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడికి సమాధానం చెప్పడంలో భాగంగా చెప్పినప్పటికీ తగలడం మాత్రం డైరెక్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కొడుకు నారా లోకేష్‌కి తగలడం గమనార్హం.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు నుంచి కెటీఆర్‌కి ఆహ్వానం రాలేదని…..సొంత ఖర్చులతోనే కెటీఆర్ ఆ సదస్సుకు వెళ్ళాడని……కెటీఆర్‌కి ఆహ్వానం వచ్చేంత సీన్ లేదని కాంగ్రెస్ తెలంగాణా అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి నోటికొచ్చినట్టుగా వాగేశాడు. ఆ వెంటనే రియాక్ట్ అయిన కెటీఆర్……వరల్డ్ ఎకనమిక్ ఫోరం నుంచి తనకు వచ్చిన ఆహ్వాన మెయిల్స్‌ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. చాలా ఇంకా డిటెయిల్స్ కావాలా అన్నట్టుగా ఉత్తమ్‌ని ఛాలెంజ్ చేశాడు. అంతటితో ఆగి ఉంటే బాగానే ఉండేది. ఆ తర్వాత పనిలో పనిగా నారా లోకేష్‌ని కామెడీ చేస్తూ కూడా కెటీఆర్ కామెంట్స్ పాస్ చేశాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఆహ్వానం లేకుండా వెళ్ళడానికి….సొంత ఖర్చులతో వెళ్ళడానికి….షో చేయడానికి వెళ్ళడానికి నేను పప్పును కాదు అంటూ సెటైర్స్ పేల్చాడు. నిజానికి ఆరకంగా సొంత ఖర్చులతో షో చేశాడని కెటీఆర్‌ని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు.

అయితే కెటీఆర్ మాత్రం……తనకు అధికారికంగా వచ్చిన ఆహ్వానాన్ని చూపించి …..అలా చేసేంత దరిద్రం నాకు లేదు…….ఆ రకంగా చేసింది నారా లోకేష్‌ అని పప్పు అంటూ ఎత్తి పొడిచాడు. ఈ సెటైర్ భలేగా పేలింది. నిజంగా కూడా కెటీఆర్‌కి అధికారిక ఆహ్వానం వచ్చింది. అయితే నారా వారికి మాత్రం ఆహ్వానం లేదు. అయినప్పటికీ సొంత షో చేశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని కెటీఆర్ ఎత్తి పొడిచాడు. ఈ విషయంపై నారా వారి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. లేకపోతే ఓటుకు కోట్లు ఎపిసోడ్ దగ్గర కాంప్రమైజ్ అయిన తర్వాత నుంచీ……..జీహెచ్ఎంసీ ఎన్నికలతో సహా ఎప్పుడూ కూడా కెసీఆర్, కెటీఆర్‌లను విమర్శించే ధైర్యం చేయలేకపోయిన నారా వారు ఇప్పుడు కూడా మౌనంగానే అన్నీ భరిస్తారేమో చూడాలి. అయితే అన్నీ భరిస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అన్న కలరింగ్ ఇవ్వడం మాత్రం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -