Tuesday, May 21, 2024
- Advertisement -

ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక బ‌రినుంచి విశాల్ ఔట్‌…అస‌లేం జ‌రిగింది…?

- Advertisement -

జ‌య‌ల‌లిత మ‌ర‌ణంతో ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక అనివార్య‌మ‌య్యింది. అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత త‌మిళ రాజ‌కీయాలు ఎలాంటి మ‌లుపులు తిరిగిందే అంద‌రికీ తెలిసిందే. అయితే అనూహ్యంగా ఆర్కె నగర్ ఉప ఎన్నిక‌లో న‌టుడు విశాల్ బిరిలోకి దిగ‌తుండ‌టంతో ర‌స‌వ్త‌రంగా మారింది. అనూహ్యంగా ఎన్నికల కమిషన్ విశాల్ నామినేషన్ తిరస్కరించింది. దీంతో విశాల్‌కు పెద్ద షాక్ త‌గిలింది.

సోమవారం జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం నామినేషన్‌ సెంటర్‌కు వెళ్లిన విశాల్ స్వతంత్ర‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు పత్రాలు సంబంధిత అధికారులకు అందించాడు. అయితే నామినేషనల్‌ లో తప్పిదాలు ఉండటంతోపాటు, వివరాలు సరిగ్గా లేవని రిటర్నింగ్‌ ఆఫీసర్‌ పేర్కొన్నారు. కాగా, స్వతంత్ర్య అభ్యర్థిగా సోమవారం విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు జయలలిత మేనకోడలు దీప జయకుమార్‌ నామినేషన్‌ కూడా తిరస్కరణకు గురైంది.

నామినేషన్‌ తిరస్కరణపై విశాల్‌ తీవ్రంగా స్పందించాడు. ఉద్దేశపూర్వకంగానే తిరస్కరించారంటూ రోడ్డుపై ధర్నాకు దిగగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట​ చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ విషయమై విశాల్‌ కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేశ్, అన్నాడీఎంకే అభ్యర్థిగా మధుసూదనన్, అన్నాడీఎంకే అమ్మ పార్టీ తరపున దినకరన్‌, బీజేపీ తరపున అభ్యర్థి కరు నాగరాజన్ ప్రధాన పార్టీల తరపున అభ్యర్థులుగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తమిళనాట క్రేజ్‌ సంపాదించుకున్న మాస్‌ హీరో విశాల్‌ బరిలోకి దిగటంతో పోటీ మరింత రసవత్తరంగా మారుతుందనుకుంటే విశాల్ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -