నేడు జీహెచ్ఎంసీ పాలకవర్గం కొలువుదీరనున్న నేపథ్యంలో బిజేపి కార్పొరేటర్లు బషీర్‌బాగ్ ఆలయాన్ని సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఎమ్మెల్సీ రాంచందర్ రావు.. బిజేపి మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, డిప్యూటి మేయర్ అభ్యర్థిగా రాంనగర్ కార్పొరేటర్ రవిచారి పేర్లను ప్రకటించారు.
పూజల అనంతరం బషీర్‌బాగ్ ఆలయం నుంచి బిజేపి కార్పొరేటర్లు వెజ్పార్క్ హోటల్‌కు వెళ్లారు. అక్కడినుంచి జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లారు.
మరోవైపు తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌తో టి.ఆర్.ఎస్ కార్పొరేటర్లు సమావేశమయ్యారు. వారికి కేటీఆర్ దిశా నిర్దేశం చేశారు. మేయర్ ఎన్నికపై అనుసరించాల్సిన విధానాన్ని ఆయన వివరించారు. అక్కడ నుంచి టి.ఆర్.ఎస్ కార్పొరేటర్లు ప్రత్యేక బస్సులో జీహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్లనున్నారు.
Also Read
విజయ్ దేవరకొండ ‘లైగర్’ డేట్ ఫిక్స్!
బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!
షర్మిల అదేరోజు పార్టీ పేరు ప్రకటిస్తారా?
ఎవరైనా పార్టీ పెట్టుకునే స్వేచ్ఛ ఉంది : పవన్ కళ్యాన్