Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ జైలుకు వెల్లాల్సిందే..

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ ప్ర‌జ‌ల వ్య‌క్తిగ‌త స‌మాచారం (డేటా) స్కామ్ వ్య‌వ‌హారం రాజ‌కీయాల్లో కాక రేపుతోంది. వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల వార్ దుమారం రేపుతోంది. ప్రజల డేటా చోరీ, ఓట్ల తొలగింపు అక్రమాలపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన జ‌గ‌న్ బాబు, లోకేస్‌ల‌పై నిప్పులు చెరిగారు.

సీఎం చంద్ర‌బాబు, లోకేష్ తీవ్ర‌మైన సైబ‌ర్ క్రైమ్ చేశార‌ని పూర్తి విచార‌ణ జ‌రిపిస్తే ఇద్ద‌రూ జైలుకెల్ల‌డం కాయం తీసుకోనున్నారు. సీఎంలాంటి వ్య‌క్తే సైబ‌ర్ నేరానికి పాల్ప‌డితే ప్ర‌జ‌లకు భ‌ద్ర‌త ఎక్క‌డ‌ని ప్ర‌శ్నించారు. పౌరుల వ్య‌క్తిగ‌త స‌మాచారం ఒక ప్ర‌యివేటు సంస్థ‌ద‌గ్గ‌ర‌కు ఎలా వ‌చ్చింద‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైమ్ ఎప్పుడూ జరగలేదని జగన్ ఆరోపించారు.

ఇంత‌టితో ఈ విష‌యాన్ని వ‌దిలి పెట్ట‌మ‌ని రానున్న రోజుల్లో ప్ర‌ధాన ఎన్నిక‌ల అధికారిని క‌ల‌సి మ‌రో సారి ఫిర్యాదు చేస్తామ‌న్నారు. ఒక పథకం ప్రకారం గత రెండేళ్లుగా ఎన్నికల ప్రక్రియను ఎలా మేనేజ్ చేయాలన్న దుర్భుద్ధితో చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. సేవా మిత్ర యాప్ ద్వారా వైసీపీ సానుభూతి ప‌రుల ఓట‌ర్ల ఒక ప్లాన్ ప్ర‌కారం తొల‌గిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఐటీ గ్రిడ్’ సంస్థ పై దాడులు జరిగినప్పుడు ఆశ్చర్యకర విషయాలు బయట కొచ్చాయని, ‘సేవా మిత్ర’ టీడీపీకి సంబంధించిన యాప్ అని, దీన్ని తయారు చేసింది ఈ సంస్థేనని అన్నారు. ‘ఆధార్’ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదని, సేవామిత్ర యాప్ లో ఆధార్ లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా? కలర్ ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకొచ్చింది? ఓటర్ల జాబితా ఐటీ గ్రిడ్ కంప్యూటర్లలో ఎలా కనబడుతోంది? ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతాల వివరాలు ఈ యాప్ లో ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. ఐటీ సంస్థ తెలంగాణాలో ఉంద‌ని, ఇక్క‌డే ఫిర్యాదు దారుడు ఇక్క‌డే ఫిర్యాదు చేశార‌ని అందుకే ఇక్క‌డి పోలీసులు విచార‌ణ చేస్తున్నార‌ని దీన్ని..దీన్నిఆస‌రాగా చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల మ‌ధ్య చిచ్చుపెట్టే విధంగా బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు.

టీడీపీకి ఓటు వేయరనే అనుమానం ఉన్నవారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే కాకుండా, అనుకూలంగా ఉన్నవారి డూప్లికేట్‌ ఓట్లను నమోదు చేస్తున్నార‌న్నారు. ఓట్ల తొల‌గింపుపై ఈసీ కి ఫిర్యాదు చేస్తె బాబుకు భ‌యం ఎందుక‌ని జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. గ‌తంలో 56 ల‌క్ష‌ల దొంగ ఓట్ల‌కు సంబంధించిన స‌మాచారాన్ని ఈసీకి అంద‌జేశామ‌న్నారు. ఎల‌క్స‌న్ క‌మిష‌న్ చ‌ర్య‌లు తీసుకోక పోవ‌డంతో 2019 జనవరిలో వచ్చిన మరో ఓటర్ల జాబితాను చెక్ చేస్తే అందులో మరో 3లక్షల డూప్లికేట్ ఓట్లు పెరిగాయన్నారు. దీని మీద కూడా తాము ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ జైలుకు వెళ్లాల్సిన నేరాలని జగన్ అన్నారు. అయితే, దీన్ని తప్పుదారి పట్టించేందుకు ఫామ్ 7 అనేదాన్ని తెరపైకి తెచ్చారని జగన్ మండిపడ్డారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -