Sunday, April 28, 2024
- Advertisement -

చంద్రబాబు చాణక్యం.. పవన్ కు కలిసొస్తుందా ?

- Advertisement -

విశాఖ ఘటన తరువాత జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. అధికార వైసీపీ పై గేరు మార్చిన సంగతి తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా భూతు పదజాలలతో వైసీపీ నేతలపై విరుచుకు పడుతున్నారు పవన్ కల్యాణ్. మంగళగిరిలో పవన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఎవరు ఊహించని విధంగా పవన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ కలయిక రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెర తీసింది. గత కొన్నాళ్లుగా టీడీపీ జనసేన మద్య పొత్తుకు సంబంధించిన వార్తలు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. పవన్ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ వైసీపీ నేతలు తరచూ విమర్శలు చేస్తూనే ఉన్నారు.

అయితే పొత్తు విషయంలో గతంలో ఎవరితోనూ కలవబోమని చెప్పుకొచ్చిన జనసేనాని, ఆ తరువాత మిత్రపక్షం అయిన బీజేపీతో కలిసి ముందుకు వెళ్లబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. ఇక టీడీపీ విషయంలో పొత్తుపై పెద్దగా స్పందించేవారు కాదు. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలంటే 2014 సీన్ రిపీట్ చేయాలని అటు పవన్.. ఇటు చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. కానీ త్రిముఖ కూటమికి బీజేపీ మాత్రం కాస్త వెనుకడుగు వేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బలంగా లేని బీజేపీతో కలిసి పోటీలో దిగడం కన్నా.. బలమైన పార్టీగా ఉన్న టీడీపీతో కలిసి పోటీలో దిగడమే వల్ల జనసేనకు కలిసొచ్చే అవకాశం ఉంది.

అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటలని చూస్తున్న జనసేన.. టీడీపీతో పొత్తుకు సై అనే అవకాశలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్ళు తెరవెనుక సాగిన పవన్ బాబు కలయిక.. విశాఖ ఘటనలో తెరపైకి వచ్చింది.. విశాఖ ఘటనలో పవన్ పై వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును వ్యరేకిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్నీ పార్టీలు కలిసి ముందుకు సాగాలని భేటీ తరువాత చంద్రబాబు చెప్పుకొచ్చారు. .అయితే ఇరు పార్టీల పొత్తు విషయంలో అటు చంద్రబాబు గాని, ఇటు పవన్ గాని క్లారిటీ ఇవ్వలేదు. కానీ వీరి కలయిక వచ్చే ఎన్నికల్లో ఇరు పార్టీల పొత్తుకు సూచనగా విశ్లేషకులు భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలు జనసేన మరియు టీడీపీ పార్టీలకు చాలా కీలకం. మరి వచ్చే ఎన్నికలతోనైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలని చూస్తున్న పవన్ కు చంద్రబాబు చాణక్యం ఏవంతవరకు కలిసొస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పవన్ భూతుపురాణం.. అసలు వ్యూహామేంటి ?

తెరపైకి వైస్ జగన్ బయోపిక్.. అదిరిపోయిన వ్యూహం ?

తప్పు ఎవరిది.. చంద్రబాబుదా ఎన్టీఆర్ దా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -