Tuesday, May 21, 2024
- Advertisement -

అలా చేస్తే ఏ పార్టీతో నైనా క‌ల‌సి ముందుకెల్తాం..

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రితో పొత్తుల విష‌యం వైసీపీ అధినేత జ‌గ‌న్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అదే ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ఓజాతీయ ఛాన‌ల్ ఇంట‌ర్రూ చేసింది. ఇంట‌ర్వూలో జ‌గ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

విభ‌జ‌న స‌మ‌యంలో పార్ల‌మెంట్‌లో అప్ప‌టి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. అదే విధంగా 2014 ఎన్నిక‌ల్లో కూడా భాజాపా ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని చెప్పి మాట‌త‌ప్పాయ‌న్నారు. ప్ర‌త్యేకహోదానినిలబెట్టుకుంటే మరో ఆలోచన లేకుండా భాజపాతో కలిసి నడిచేందుకు అభ్యంతరం లేదంటూ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దాంతో పాటు ఏపార్టీ అయితే ప్ర‌త్యేక హ‌దాఇస్తే ఇత‌ర పార్టీల‌తో క‌ల‌సి వెల్తామ‌న్నారు.

తనపై ఉన్నకేసులన్నీ కాంగ్రెస్, టిడిపి కలిసి పెట్టినవే అన్న విషయం అందరికీ తెలుసన్నారు. తమ ప్రధాన టార్గెట్ చంద్రబాబునాయుడే అంటూ స్పష్టం చేశారు. అబద్దాలతో, అవినీతితో చంద్రబాబు పాలన సాగుతోందని మండిపడ్డారు. తాను కాంగ్రెస్ లో ఉన్నంత కాలం గౌరవీయనీయమైన వ్యక్తిగానే ఉన్నట్లు గుర్తుచేశారు. కాంగ్రెస్‌పార్టీనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి సొంతంగా పార్టీ పెట్టిన త‌ర్వాతే టీడీపీ, కాంగ్రెస్‌క‌ల‌సి అక్ర‌మ కేసులు పెట్టాయ‌న్నారు.

జగన్ చేసిన తాజా వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది. మూడున్నరేళ్ళుగా కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశ్యం లేదని తేలిపోయింది. ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్రం ఇప్పటికే పలుమార్లు పిల్లిమొగ్గలేసిన సంగతి అందరూ చూస్తున్నదేన‌న్నారు. ఇటువంటి నేపధ్యంలో జగన్ వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి మొదలైంది. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం ఏమైనా స్టాండ్ మార్చుకుంటోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

https://www.facebook.com/ysjagan/videos/1667934359893691/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -