Wednesday, May 15, 2024
- Advertisement -

చంద్ర‌బాబుపై సంల‌చ‌న ఆరోప‌ణ‌లు చేసిన వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

- Advertisement -

వైసీపీ, టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం ఏమాత్రం త‌గ్గ‌డంలేదు. నాలుగు రోజుల‌క్రితం వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి, టీడీపీ ఎంపీ సీఎమ్ ర‌మేష్ మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగింది. విజ‌య‌సాయి ప్ర‌ధానికాళ్లకు న‌మ‌స్కారం చేశార‌ని ర‌మేష్ ఆరోపించ‌డంతో అంతే స్థాయిలో ఆ ఆరోప‌న‌లును తిప్పికొట్టారు విజ‌య‌సాయి. దీనిలో భాగంగానే టీడీపీ , చంద్ర‌బాబుపై సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేసిసిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మ‌రో సారి బాబుపై సంచ‌ల‌న ఆరోప‌న‌లు చేశారు విజ‌య‌సాయిరెడ్డి. 2016 మార్చి 12, 13, 14 తేదీల్లో తెలుగుదేశం నాయకులు లండన్‌ వెళ్లి విజయమాల్యాను కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎన్నిక‌ల‌కోసం రూ.150 కోట్లు విరాళంగా తీసుకోలేదాని ఆరోపించారు. మాల్యానుంచి తీసుకున్న విరాళాల‌పై చంద్ర‌బాబు జ‌వాబు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. జ‌వాబు చెప్ప‌కుంటే అవ‌న్నీ వాస్తవాలు అనుకోవాల్సి వ‌స్తుంద‌న్నారు విజ‌య‌సాయిరెడ్డి.

ప్ర‌త్యేక‌హోదాపై యూట‌ర్న్ అంకుల్ ఢిల్లీకి ఎందుకొచ్చార‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో అన్ని పార్టీల‌తో కాపురం చేసి విడాకులిచ్చిన బాబు …ఇప్పుడు కొత్త పార్ట‌న‌ర్ కోసం వ‌స్తున్నార‌ని విజ‌య‌సాయి వ్యాఖ్యానించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు సభాహక్కుల నోటీస్ ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -