- Advertisement -

పాక్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై డ్రోన్‌ల‌తో విరుచుకు ప‌డండి..సైన్యానికి ట్రంప్ ఆదేశాలు

- Advertisement -
Donald Trump administration hardens stance towards on pakistan terror safe havens

నిత్యం భార‌త స‌రిహ‌ద్దుల్లో పాక్ క‌వ్వింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ…మ‌రో వైపు సీమాంత‌ర ఉగ్ర‌వాదాన్ని ఎగ‌దోస్తున్న పాకిస్థాన్‌కు ఇక మూడిన‌ట్లే.ఉగ్ర‌వాదంపై పోరాడుతున్నామ‌ని మాట‌లు చెప్పి అమెరికానుంచి అధికంగా నిధులును అందుకుంటోంది.

కాని చేత‌ల్లో మాత్రం చూపించ‌డంలేదు.పెద్ద‌న్న నుంచి తీసుకుంటున్న నిధుల‌ను పూర్తిగా ఉగ్ర‌వాదాన్ని ప్రోత్స‌హించ‌డానికి ఖ‌ర్చుపెడుతున్న సంగ‌తి తెలిసిందే.అయితే ఇప్పుడా ప‌ప్పులు ఉడ‌క‌వ్‌.

{loadmodule mod_custom,GA1}

ఉగ్రవాదులకు ఊతమిస్తూ, వారి స్థావరాలను కొనసాగించేందుకు సహకరిస్తున్న పాకిస్థాన్ పై మరింత కఠినంగా వ్యవహరించాలని ట్రంప్ సర్కారు నిర్ణయించింది. పాక్ ఉగ్ర స్థావరాలపై మానవ రహిత విమానాలతో దాడులు చేసేందుకు ట్రంప్ నుంచి ఆదేశాలు వచ్చాయని రక్షణ శాఖ అధికారి తెలిపారు. ఉగ్ర‌వాదంపైపాక్ ఆడుతున్న క‌ప‌ట‌నాట‌కాలకు మూడిన‌ట్లే.
ఇప్ప‌టివ‌ర‌కు పాకిస్థాన్ కు అందిస్తున్న సహాయ సహకారాలను తగ్గించాలని, ‘నాన్ – నాటో’ సభ్యదేశాల్లోని ప్రధాన దేశాల్లో ఒకటైన పాకిస్థాన్ రేటింగ్ ను తగ్గించాలని కూడా ట్రంప్ సూచించినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ అధికారి తెలిపారు. తమంతట తాముగా ఉగ్ర కార్యకలాపాలపై పాక్ పాలకులు ఉక్కు పాదం మోపుతారని ఎదురుచూశామని, అది జరగదని తెలుస్తుండగా, ఆఫ్గనిస్థాన్ లోని ఉగ్రవాద స్థావరాలపై జరుపుతున్నట్టుగానే డ్రోన్ దాడులను పాక్ లోనూ చేయాలని ట్రంప్ వెల్లడించినట్టు ఆయన అన్నారు. ఈ విషయమై స్పందించాలని వాషింగ్టన్ లోని పాక్ ఎంబసీని కోరగా, వారు స్పందించలేదు.

{loadmodule mod_custom,GA2}

గ‌తంలో పాక్ చెప్పిన‌ట్లుగా న‌డుచుకొనే అమెరికా ఇప్పుడు మాత్రం మారిపోయింది.ఇప్ప‌టి వ‌ర‌కు పాక్‌లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై ప్ర‌త్య‌క్షంగా దాడుల‌కు దిగ‌లేదు.కాని ఇప్పుడు మాత్రం నేరుగా దాడుల‌కు దిగేందుకు సిద్ద‌మ‌య్యింది.మ‌రి పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}sduhP8npg6E{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -