Saturday, May 18, 2024
- Advertisement -

పళని పుణ్యక్షేత్రం – విశేషాలు

- Advertisement -

పళని పుణ్యక్షేత్రం తమిళనాడు రాష్ట్రము లో కొలువై ఉన్నది. దండాయుధపాణి అయిన పళని స్వామి ని ఈ ఆలయం లో భక్తులు కొలుస్తారు. గర్భ గుడి లోని స్వామి వారి మూర్తి ని నవ పాషాణంతో సిద్ధ భోగర్ అనే మహర్షి చెక్కారు. పూర్వం స్వామి వారి తొడ భాగాన అలంకరణ చేసిన విభూతి ని కుష్ఠు వ్యాధిగ్రస్తులకు దివ్య ఔషధం గా ఇచ్చేవారు. విగ్రహంలో అరుగుదల క్రమ క్రమం గా పెరిగిన పక్షంలో విభూతి పంచివ్వడాన్ని నిలిపివేశారు.

గణాధిపత్యం తనకు లభించలేదని అలిగిన కుమారస్వామి వారు ఈ ప్రదేశానికి వచ్చారని,, అపుడు శివ పార్వతులు ఇద్దరు ఈ ప్రాంతానికి విచ్చేసి షణ్ముఖ స్వామి ని బుజ్జగించి స్వామిని నీవు సకల జ్ఞానము లకు ఫలానివి అని ఆశీర్వాదం తెలియచేశారని చారిత్రక కథనాలు మనకు విశదీకరిస్తున్నాయి. తమిళం లో ఫలం,, నీ అనే రెండు పదాలు కలిసి పళని అయిందని చెప్తారు. ఈ కొండ పై కావల్ల ఉత్సవాలు కు ప్రసిద్ధి. ఈ పుణ్య క్షేత్రం తమిళనాడు లో మధురై నుంచి 120 కిలోమీటర్లు దూరంలో కొలువైఉంది.పళని కొండకు బస్సు,, రైల్వే సౌకర్యం కలదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -