Tuesday, May 14, 2024
- Advertisement -

పవన్, శైలజా కిరణ్, జయదేవ్, చింతమనేని, ఆర్కే, అశోక్ బాబు… అధికార మత్తేనా?

- Advertisement -

పొద్దున్నలేస్తే జగన్‌పై కేసులు అంటూ సంవత్సరాలుగా ఒకటే పాట పాడుతూ ఉంటారు బాబు అండ్ బ్యాచ్. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, పచ్చ పార్టీలో నోరున్న నేతలు, ఆంధ్రజ్యోతి, ఈనాడులతో బాబు భజన మీడియా సంస్థలన్నీ కూడా జగన్ కేసుల గురించి ఊకదంపుడు కబుర్లు చెప్తూనే ఉంటాయి. సోనియా ప్రోద్బలంతో శంకర్‌రావు వేసిన కేసులు, సోనియాతో కుమ్మక్కయి చంద్రబాబు నడిపించిన కేసుల వ్యవహారం గురించే అంత మాట్లాడుకుంటే తప్పులు చేస్తూ డైరెక్ట్‌గా దొరికిపోయిన వాళ్ళ కేసుల గురించి ఎంత మాట్లాడుకోవాలి?

ఓటుకు నోట్లు కేసులో ఆడియో, వీడియా సాక్ష్యాలతో దొరికిపోయాడు చంద్రబాబు. ఇక చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని చెప్పిన ఎలక్షన్ రిఫార్మ్స్ సంస్థ మరో విషయం కూడా చెప్పింది. చంద్రబాబుపై మూడు క్రిమినల్ కేసులు ఉన్నాయట. అలాగే చంద్రబాబు స్టేల వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబు భజనసేనుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో ఏమీ తక్కువ తినలేదు. తన జనసేన పార్టీ ఆఫీస్ స్థలం కబ్జా వ్యవహారం మీడియాకు, కోర్టులకు ఎక్కింది. అక్రమాలు, కబ్జాలు ఏమీ లేవు అని ముందుగా దబాయించిన జనసేనుడు…….ఆ తర్వాత రీసెంట్‌గా కొన్ని రోజుల క్రితమే ఎవరికీ చెప్పా పెట్టకుండా ఆ స్థలంలో నుంచి జనసేన ఆఫీస్ నిర్మాణ సామాగ్రిని మొత్తం సైలెంట్‌గా తరలించేశాడు. ఊహాతీతమైన పవన్ ఈ చర్య గురించి ఏమనుకోవాలో ఆయనే చెప్పాలి. ఇక ఈనాడు రామోజీరావు కోడలు, మార్గదర్శి ఎండి శైలజా కిరణ్ కేసు కూడా ఇలాంటిదే. మార్గదర్శి చిట్స్‌కి సంబంధించిన ఒక స్త్రీ సంతకం ఫోర్జరీ చేసి ఆ బలహీనురాలి స్థలం కబ్జా చేసేశారన్నది కేసు. ప్రస్తుతం బాబు కోటరీలో ముఖ్యుడైన జేసీల అల్లుడు కబ్జా వ్యవహారాల్లో అరెస్ట్ అయి ఉన్నాడు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణపై అరెస్ట్ వారెంట్స్ జారీ అవుతూనే ఉన్నాయి. తాజాగా విభజన సమయంలో ఆరడుగుల బుల్లెట్ అంటూ బాబు మీడియా రంగంలోకి దించిన, సీమాంధ్రులను నిండా ముంచిన అశోక్ బాబు కేసుల వ్యవహారాలు సంచలన వార్తలు అవుతున్నాయి. గల్లా జయదేవ్ ఆఫీస్ కబ్జా వ్యవహారం కూడా ఆ మధ్య సంచలనం అయింది. తాజాగా చింతమనేని ప్రభాకర్‌కి సంవత్సరాల పాటు శిక్ష వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.

చంద్రబాబుకు సన్నిహిత వ్యక్తులందరూ కూడా ఇలా కోర్టు కేసులు, భూ కబ్జా వ్యవహారాలకు పాల్పడుతూ ఉండడం……వాళ్ళపై కోర్టుల్లో శిక్షలు పడుతూ ఉండడం లాంటి వార్తలు మీడియాలో ఎలాగూ కనిపించవు. తెలుగు నాట మీడియా అంతా కూడా బాబు గుప్పిట్లోనే ఉంది కాబట్టి. సాక్షి మీడియా ఉన్నా ఇలాంటి విషయాలు బయటపెట్టే సామర్థ్యం కానీ ప్రజల్లో ఆలోచనలు రేకెత్తేలా పచ్చ బ్యాచ్ దారుణాలు హైలైట్ చేసే స్థాయి కానీ సాక్షి మీడియాకు లేదు. అయితే మీడియాలో రాకపోయినంత మాత్రాన…..మీడియా మొత్తం గుప్పిట్లో పెట్లుకున్నంత మాత్రాన పచ్చ జనాలు చేసే అక్రమాలన్నీ ఒప్పులయిపోతాయా? నిప్పు‌ని, నిజాయితీపరుడుని అని చెప్పుకునే చంద్రబాబు, ఆయన చుట్టూ ఉన్నవాళ్ళు ఇలాంటి అక్రమ వ్యవహరాలతో సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -