Thursday, May 16, 2024
- Advertisement -

మార్చి 31 తర్వాత జియో సిమ్ పడేయకండి.. మరో సూపర్ ఆఫర్ ఇచ్చిన జియో

- Advertisement -
After March 31 Jio Sim Dont Droped

రెండు రోజుల తర్వాత జియో ఇంటర్నెట్ వాడుతున్న వారు కి ఆ ఉచిత సర్వీసులు ఆగిపోనున్నాయి. కాల్స్ తప్ప ఏది ఉచితం కాదు. ఇంటర్నెట్ వాడాలంటే డబ్బు పెట్టి కొనాల్సిందే. కాల్స్ అన్నా ఉచితంగా ఉంటాయి కదా ఇంటర్నెట్ ది ఏముంది అను అనుకుంటున్నారా? రీచార్జ్ చేసుకోకుంటే తప్ప ఆ కాల్స్ కూడా రాకపోవచ్చు.  

కాబట్టి జియో ప్రైమ్ తీసుకోవాల్సిందే. ఇక జియో సబ్ స్క్రిప్షన్ ఎలా తీసుకోవాలో మీకు తెలిసిన విషయమే.  జియో యాప్ లోకి వెళ్ళి జియో ప్రైమ్ మీద క్లిక్ చేసి సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఇదే కనెక్షన్ మీ డెబిట్/క్రెడిట్ కార్డుతో కాకుండా జియో మని యాప్ తో చేసుకుంటే, ప్రతీ రీఛార్జ్ మీద 50 రూపాయల డిస్కౌంట్ వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలుసుకున్నారుగా. ఇదే మొబిక్విక్ తో చేస్తే 20% డిస్కౌంటు ఉంటుంది. ఇవన్ని ఇలా ఉంటే జియో నుంచి మరో తీపికబురు అందేలా ఉంది.

ప్రస్తుతానికైతే జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన చివరి తేది మార్చి 31. అక్కడినుంచి జియో ప్రైమ్, జియో రెండు వేరు వేరు విభాగాలు. కాని సమయం అయిపోతుంది కదా అని బాధపడకండి. జియో ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ గడువు పెరగనుందని సమాచారం. మరో రెండుమూడు రోజుల్లో జియో దీనికి సంబంధించి ఓ ప్రకటన చేయవచ్చు. అయితే ఇదేమీ మన కోసం పెంచుతున్న గడువు కాదు. జియోకి ప్రైమ్ అనుకున్నంత రెస్పాన్స్ లేదు. అందుకే, గడువు పెంచితే ప్రైమ్ వైపు మళ్ళించవచ్చు అని జియో ప్లాన్. ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే.. జియో తన రిఛార్జ్ల మీద మరిన్ని డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించే చాన్సులు ఉన్నాయట. కాబట్టి మార్చి 31 దాటగానే జియో సిమ్ ని పడేయకండి. 

{youtube}Rsvj3-QhXWg{/youtube}

Related

  1. జియోకు షాక్ : స్మార్ట్ ఫోన్ ఉంటే 1GB డేటా ఉచితం
  2. జియోకి పోటీ ఇచ్చిన ఐడియా.. సూపర్ ఆఫర్ ఇదే!
  3. జియో వాడేవారికి పేటీఎం సూపర్ ఆఫర్ ఇదే!
  4. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -