Friday, April 26, 2024
- Advertisement -

నోటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఇలా పోగొట్టుకోండి..

- Advertisement -

నోటి దుర్వాసన తో ఇబ్బంది పడుతున్న వారు చాలా మందే ఉంటారు. అయితే, నోటి నుంచి దుర్వాసన రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో మొదటిది లాలాజలం తగ్గిపోవడం. అలాగే, చాకెట్లు, స్వీట్లు తిన్న తర్వాత సరిగా శుభ్రం చేసుకోకపోతే.. బ్యాక్టిరియా చేరి దుర్వాసన రావడానికి కారణమవుతుంది. అలాగే, పొగాకు నమలడం, స్మోకింగ్ చేయడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది.

ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. ఈ సమస్యను మీరు దూరం చేసుకోవాలనుకుంటే.. ఆహారం తీసుకున్న వెంటనే నోటిని శుభ్రంగా కడుక్కొవాలి. పొగాకు, సిగరెట్లు తాగే అలవాటును మానుకోవాలి. ఉల్లి, వెల్లుల్లి పదర్థాలు తిన్నప్పుడు కూడా నోటి నుంచి దుర్వాసన వస్తుంది. దీనికి కారణం ఇందులో ఉండే సల్ఫర్ కారణం. కాబట్టి బయటకు, మీటింగ్ లకు వెళ్లేప్పుడు ఈ పదర్థాలు తీసుకోకుండా ఉండటం ఉత్తమం.

యాలకకులు, లవంగాలు వంటి సుగంధద్రవ్యాలు తీసుకోవటం వల్ల కూడా నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. మౌత్ వాష్ లను వాడటం వల్ల కూడా నోటీలో బ్యాక్టిరియా, ఇతర సూక్ష్మ క్రీములు పెరగకుండా చేయడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. వీటన్నింటి కంటే ముఖ్యమైన విషయం నోటిని శుభ్రంగా కడుక్కొవడం వల్ల కూడా నోటి నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.

సిల్వ‌ర్ శారీలో త‌ళుక్కుమ‌న్న కైరా అద్వాని

స‌లార్‌లో 100 మంది కొత్త యాక్ట‌ర్లు

‘నూటొక్క జిల్లాల అందగాడు’.. వ‌చ్చెస్తున్నాడు !

బండ్ల గ‌ణేశ్ కు ప‌వ‌న్ గ్రీన్‌సిగ్న‌ల్‌.. పూరీ డైరెక్ష‌న్‌లో మూడో చిత్రం.. !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -