Friday, March 29, 2024
- Advertisement -

హై కోర్టు లో మరోసారి ఎన్నికల కమిషనర్ కి ప్రశ్నలు..!

- Advertisement -

ఏపీలో స్థానిక ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్ఈసీకి లేదంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం ఎస్‌ఈసీకి లేదని పలువురు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఏకగ్రీవాలు అయిన స్థానాలకు డిక్లరేషన్​కు సంబంధించి.. ఫాం-10 ఇచ్చి ఉంటే.. ఎస్‌ఈసీ విచారణ జరపవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, బలవంతపు ఏకగ్రీవాలపై సమీక్షిస్తామని ఎస్ఈసీ గతంలో చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు తాజా ఉత్తర్వులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

బెదిరింపులకు పాల్పడి నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకుంటే, తాము పరిశీలించి మళ్లీ నామినేషన్ వేసే వెసులుబాటు కల్పిస్తామని ఎస్ఈసీ ఇంతకుముందు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. ఏకగ్రీవాలైన చోట ఫాం-10 ఇవ్వకుంటే విచారణ జరిపిన తర్వాత… ఫలితాలు వెల్లడించవద్దని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -