Thursday, April 25, 2024
- Advertisement -

మరింత కష్టంగా హెచ్1బీ.. ప్రయాణము ఆగుము..!

- Advertisement -

విదేశీ నిపుణులకు అందించే హెచ్​1బీ సహా ఇతర వర్క్​ వీసాలపై ఆంక్షలను మరో మూడు నెలలు పొడింగించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. మార్చి 31 వరకు హెచ్​1బీ వీసాల రద్దు కొనసాగుతుందని తెలిపారు. దేశంలో కొవిడ్​-19 వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. లేబర్​ మార్కెట్​, కమ్యూనిటీ హెల్త్​ వ్యవస్థపై పూర్థిస్థాయిలో వాటి ప్రభావం లేకపోవటం, అమెరికా కార్మికుల ఉద్యోగ భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

వివిధ రకాల వర్క్​ వీసాలపై ఆంక్షలను గత ఏడాది ఏప్రిల్​ 22, జూన్​ 22న రెండు సార్లు జారీ చేశారు ట్రంప్​. డిసెంబర్​ 31తో ఆ గడువు ముగియనుంది. కొద్ది గంటల ముందు తాజాగా మరోమారు ఆదేశాలు జారీ చేశారు.

అధ్యక్షుడు ట్రంప్​ తాజా నిర్ణయం వందలాది మంది భారతీయ ఐటీ నిపుణులపై తీవ్ర ప్రభావం చూపనుంది. అలాగే 2021 ఆర్థిక ఏడాది కోసం గత అక్టోబర్​లో నుంచి హెచ్​1బీ వీసాలు జారీ చేసిన పలు అమెరికా, భారత కంపెనీలపైనా ఈ ప్రభావం పడనుంది. హెచ్​1బీ వీసాల కోసం ప్రతి ఏటా భారత్​, చైనా నుంచే అధికంగా దరఖాస్తులు వస్తాయి. ట్రంప్ తాజా నిర్ణయం వల్ల మార్చి 31 వరకు వీసా స్టాంపింగ్​ కోసం వేచి చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి.

వీసా ఆంక్షలు.. అందరికీ ట్రంప్ షాక్..!

బైడెన్ టీకా పంపిణీ పై వివాదాస్పద వ్యాఖ్యలు..!

అక్కినేని కోడలుపై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -