- Advertisement -

బంక్ లో పని చేసిన అంబాని ఎలా ఎదిగాడంటే..?

- Advertisement -
Dheeru Bhai Ambani Life Start From Monthly 300

ధీరుభాయి అంబానీ.. ఈ పేరు వల్ల భారతీయ మార్కెట్ ను షేక్ అవుతుంది. ప్రపంచ సంపన్నులు సైతం ఈ పేరు వింటే షాక్ అవుతారు.  ఎటువంటి ప్రోత్సాహం లేదు, బ్యాక్ సపోర్టూ లేదు.. డబ్బు ఇంట్లో పుట్టలేదు. చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. స్కూల్ స్టడీతోనే చదువుకు పుల్ స్టాప్ చెప్పేశాడు.

ఆ పైన చవడానికి.. స్థోమతగాని, అవకాశాలు కాని లేవు. జీరో నుండి మెదలు పెట్టి నేడు ఆయన పేరునే ఓ బ్రాండ్ గా చేసుకున్నాడు. అటువంటి వ్యక్తి జీవితం లోకి ఓ సారి తొంగిచూస్తే.. ఎన్నో నమ్మలేని నిజాలు.. ఆయన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి.  పెట్రోల్ బంక్ లో కేవలం 300రూ.ల నెల జీతానికి పనిచేశాడు. అలా మొదలై దేశంలోనే నెంబర్-1 సంపన్నుడిగా ఎదిగాడు.. ఆయన ప్రస్థానం ఓసారి చూద్దాం..

* పర్యాటకులకు బజ్జీలు అమ్ముతూ జీవనాన్ని కొనసాగించాడు.

* 16 సంవత్సరాల్లో 10 వ తరగతి కంప్లీట్ చేసి పెట్రోల్ బంక్ లో నెలకు 300 రూపాయల జీతంపై యెమెన్ దేశంలో పనికి కుదిరాడు.

* 50 వేల రూపాయలను జమ చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చి, ఆ డబ్బులతో వస్త్ర వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు.

* మూడు స్టూల్స్, ఒక ల్యాండ్ లైన్ ఫోన్, ఒక టేబుల్ గల ఓ చిన్న అద్దె గదిలో రిలయన్స్ కంపెనీని స్టార్ట్ చేశాడు.

* విమల్ అనే బ్రాండ్ తో అహ్మదాబాద్ లో మొట్టమొదటి సారిగా ఓ బట్టల కంపెనీని స్టార్ట్ చేశాడు.

* అంచెలచెంచులుగా ఎదిగిన అంబానీతన కంపెనీలోని 35 వేల మంది షేర్ హోల్డర్స్ తో స్టేడియంలో మీటింగ్ పెట్టుకునే వాడు. ఓ కంపెనీ మీటింగ్ స్టేడియంలో పెట్టుకోవడం ఇదే ప్రథమం.

* 85వేల మంది ఉద్యోగులు గల ఈ కంపెనీ కట్టిన ట్యాక్స్ 1966 లో సెంట్రల్ బడ్జెట్ లో 5 శాతం.

* అంతర్జాతీయ స్థాయిలో షేర్ హోల్డర్స్ కలిగిన ఫస్ట్ భారతీయ కంపెనీ రిలయన్స్.

{youtube}v=gMlY-31TP84{/youtube}

Related

  1. ఈ బిచ్చగాడి ఆస్తులు తెలుస్తే.. దిమ్మతిరగాల్సిందే!
  2. ప్రభుత్వానికి దిమ్మతిరిగే దెబ్బ కొట్టిన జియో .. ఎంత నష్టమో తెలుసా..?
  3. మన ఫేస్ బుక్ అకౌంట్ తో ఫేస్ బుక్ కంపెనీ ఎంత సంపాదిస్తుందో తెలుసా…
  4. షాప్ ఓనర్‌తో హీరోయిన్ రొమాన్స్.. నెట్ లో వీడియో హల్ చల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -