Wednesday, May 15, 2024
- Advertisement -

ఒక్కో ఫిల్మ్‌ రిపోర్టర్‌కు 2 లక్షల ఆదాయమా!?

- Advertisement -

శ్రీమంతుడు మరీ తెలివి తేటలకు పోతున్నాడు. బాహుబలి తరహాలోనే…. ప్రచార కార్యక్రమాల్లో పొదుపుగా వ్యవహరిస్తున్నాడు. ఎంత పొదుపు అంటే… అప్పటి వరకూ మాధ్యమాలు నెత్తిన ఎత్తుకుని చేసిన ప్రచారానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా…

ఆ మధ్యమాల రిపోర్టర్లనే కొనేసంతగా. ఎన్నో సంస్థలు..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ఛానల్లకు సినిమా ప్రమోషన్ కోసం రావల్సిన సాయం అందకుండా పోతోంది. దీనివలన ఆ ప్రభావం ఆ డిపార్డ్ మెంట్ మీద పడి కాస్ట్ కటింగ్ లో భాగంగా వారి జాబులే పోతున్నాయి. అంటే ఫైనల్ గా ఇక్కడ ఫిలిం రిపోర్టర్ ఒక్కడే లాభపడుతున్నాడు.

ఎంత లాభ పడుతున్నాడంటే ఏకంగా టాప్ 5 ఛానల్స్ కు సంబందించిన రిపోర్ట్లకు అనధికారికంగా ఎలాంటి బ్లాక్ మెయిల్ చేయకుండానే 2 లక్షల రూపాయల వరకు వచ్చిపడిపోతున్నాయి.

ఇంతలా జరగుతున్నా…. టీవీల యాజమాన్యాలు ఫీల్డ్ లో ఏం జరుగుతుందనే దానిపై తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు. అలా చేయకుండా కాస్ట్ కటింగ్ మంత్రాన్ని జపిస్తున్నారు. ఒక రిపోర్టర్ కు సంస్థ జీతం ఇస్తోంది. అలాగే ప్రెస్మీట్ కవర్ చేసిన ప్రతిసారి ఓ కవర్ వస్తోంది. ఆ కవర్ డబ్బుతోనే అతను సాఫ్ట్ వేర్ ఉద్యోగిలా బతికేయెచ్చు. అయినా అది ఫిలిం రిపోర్టకు చాలడం లేదు.

అంతటితో ఊరుకుంటున్నారా అంటే అదీ లేదు. మా సంస్థకు యాడ్ ఇవ్వకపోయినా పర్లేదు మాకు ప్యాకేజ్ ఇచ్చేయండి.మీకు కావల్సినట్లుగా…. మేము మీ సినిమాను మా ఛానల్లో ప్రమోట్ చేస్తామంటున్నారు. ఐతే ఒక ఫిలిం రిపోర్ట‌ర్ చేతిలో ఏమీ ఉండ‌దు.అత‌ను అనుకున్న‌దేది ఛాన‌ల్ లో ప‌డ‌క‌పోయినా స‌రే ఇక్క‌డ ఫిలిం రిపోర్ట‌ర్ చేతిలో ఏదో ఉంటుంద‌ని ఫీలైపోయి పిఆర్ ఓ లు కూడా వారు ఏం చెబితే అది న‌మ్మేసి పైస‌ల్ ఇచ్చేస్తున్నారు. ఇంత జరగుతున్నా…సిఇవోలు,మేనేజ్ మెంట్ లు ,మార్కెటింగ్ డిపార్ట్ మెంట్ లు మిన్నకుండి పోవడం….సంస్థలు చంకనాకి పోవడానికి కారణమౌతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -