Sunday, May 19, 2024
- Advertisement -

అద్దాల‌రైల్లోనుంచి అర‌కుఅందాలు

- Advertisement -
Glass domed coaches for Vizag to Araku

ఏపీలోని అర‌కువ్యాలీ ప్ర‌కృతి అందాల‌కు ప్ర‌సిద్ది. తెలుగురాష్ట్రాల‌ల‌నుంచే కాకుండా ఇత‌ర రాష్ట్రాల‌నుంచి ప‌ర్యాట‌కులు అర‌కు అందాల‌ను అస్వాదిస్తుంటారు. భూలోకంలో  వెల‌సిన స్వ‌ర్గం అర‌కు వ్యాలీ.సముద్రమట్టానికి సుమారు 600 మీటర్ల నుండి 900 మీటర్ల ఎత్తులో ఉంది.

విశాఖపట్నానికి 115 కి.మీ.ల దూరంలో ఉన్న అరకు ఆహ్లాదకరమైన వాతావరణములతో, కొండలతో లోయలతోపాటు బొర్రాగృహ‌లు ప‌ర్యాట‌కుల‌ను విశేషంగా అక‌ట్టుకుంటున్నాయి. అర‌కు  అందాల‌ను  చూడాలంటే రోడు ప్ర‌యానంచేయాలి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌కు సాదార‌న రైల్లో అందాల‌ను పూర్తిగా అస్వాదించే అవ‌కాశం ప‌ర్యాట‌కుల‌కు లేదు. అయితే కొత్త‌గా వ‌స్తున్న అద్దాల రైల్లు ద్వార ప‌ ర్యాట‌కులు 360 డ్రిగ్రీల కోనంలో అర‌కు అందాల‌ను చూడ‌వ‌చ్చు.

అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన చెన్నైలోని ఇంటెగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌) ఇప్పుడు   ప‌ర్యాట‌కుల‌కోసం అత్యాధునికి  స‌దుపాయాల‌తో అద్దాల రైలు పెట్టెల‌ను త‌యారు చేసింది. అత్యాధునిక రైలుపెట్టెల తయారీతో ప్రయాణికులను, పర్యాటకులను ఆకర్షించనుంది.  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక కేంద్రం అరకు అందాలను వీక్షించడానికి అద్దాల రైలుపెట్టెలను తయారు చేసి రైల్వేకి అందిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌, కశ్మీర్‌ రాష్ట్రాలలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు మొదటిసారిగా దేశంలోనే పైకప్పు అంతా ప్రత్యేక అద్దాలతో నిండిన రైలు పెట్టెలను రూపొందించింది. రొటేటింగ్‌ కుర్చీలతో తయారు చేస్తున్న మొదటి పర్యాటక కోచ్‌ మంగళవారం ఇక్కడి నుంచి విశాఖపట్నానికి రానుంది. ఐఆర్‌సీటీసీ  ఈరైల్ల‌ను న‌డుప‌నుంది. 

అద్దాల పెట్టెల రైలు ప్ర‌త్యేకంగా చెప్పాలంటే దేశంలోనే మొదటిసారిగా ఈ తరహా కోచ్‌లను ఐసీఎఫ్‌ తయారు చేస్తోంది. బయటి వాతావరణానికి తగిన రీతిగాపగలు, రాత్రిని ప్రతిఫలింపజేసే విధంగా ఉండే రైలులో రొటేటింగ్‌ కుర్చీలు ప్రత్యేకత సంతరించుకున్నాయని రైల్వే అధికారులు వెల్ల‌డించారు. కోచ్‌ మొత్తం స్టెయిన్‌లెస్‌ స్టీలుతో తయారు చేస్తున్నట్లు  అధికారులుతెలిపారు. రొటేటింగ్‌ కుర్చీల వల్ల ప్రకృతి సోయగాలను360 డిగ్రీలలో తిరిగి చూడవ‌చ్చు. రైలు మొత్తం ఏసీ సౌకర్యం ఉంటుంది.. ఆధునిక టాయ్‌లెట్‌, స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ లగేేజీ ర్యాక్‌, టీవీ సౌకర్యం ఇందులో ఉన్నాయన్నారు.ఇక‌నుంచి ప‌ర్యాట‌కులు రైలు పెట్టెల అద్దాల‌నుంచి అర‌కు అందాల‌ను పూర్తిగా అస్వాదించ‌డంతోపాటు ప‌ర్యాట‌కం కూడా అభి వృధ్ది చెంద‌నుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -