- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి— జైట్లీ

- Advertisement -
arun jaitley special interest

దేశంలో సమర్థ నాయకత్వం ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మోదీ నిరూపించారని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. విజయవాడలో జరిగిన భాజపా కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో దేశం దూసుకెళ్తొందని… దేశాభివృద్ధికి మోదీ నిరంతరం కష్టపడుతున్నారని జైట్లీ అన్నారు.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచీ ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకున్నారన్నారు. ఏ పని అప్పగించినా బాధ్యతగా పూర్తి చేయడం వెంకయ్యకు అలవాటని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోందని.. దీనిలో భాగంగానే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని జైట్లీ తెలిపారు. విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్‌ ఏ విధంగా నష్టపోతుందో… దానిని ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో భాజపా ముందుగానే సమీక్షించిందని… దానికి అనుగుణంగానే సాయం అందిస్తున్నట్లు చెప్పారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -