బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ ని గడగడలాదించాడు రాజమౌళి. ఇప్పుడు రాజమౌళి తన తర్వాత సినిమాని తీయబోతున్నాడనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ అయి కూర్చుంది. ఎక్కడ చూసినా ఈ విషయం గురించే అందరూ చర్చించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రాజమౌళి ఆ ప్రశ్నకి జవాబు అయితే ఇవ్వలేదు.
తాను ఇప్పుడే ఏమి అనుకోట్లేదని, కాస్త సమయం విశ్రాంతి తీసుకున్నాక ఆలోచిస్తానని వెల్లడించాడు. కానీ.. మీడియా వారికి అ సమాధానం అంత సంతృప్తికరంగా అనిపించలేదు. దీంతో తమదైన శైలిలో ఆరాతీయగా, ఊహించని విషయం ఒకటి బయటకు వచ్చింది. రాజమౌళి తన తదుపరి సినిమాగా బాహుబలి 3 ని ప్లాన్ చేయబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడున్న జోష్ లో ఆ ప్రాంచైజీని కంటిన్యూ చేయాలని జక్కన్న, అతని తండ్రి విజేంద్రప్రసాద్ భావిస్తున్నారని.. ఆల్రెడీ అందుకు అందుకు పక్కా ప్రణాళిక కూడా రచించికున్నారని వార్తలొస్తున్నాయి.
ఇప్పటికే విజయేంద్రప్రసాద్ కథని కూడా రెడీ చేశారని, దానిపై జక్కన్న స్టెడీ చేస్తున్నాడని గుసగుసలాడుకుంటున్నారు. ఈ రూమర్లకు బలం చేకూర్లుస్తూ.. విజయేంద్రప్రసాద్ రీసెంట్‌గా ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు తెలిపారు. ‘బాహుబలి-3’ గురించి విలేకరి ఓ ప్రశ్న వేయగా.. తమ దగ్గర ఆ సినిమా కథతోపాటు 4,5 పార్ట్‌లకి సంబంధించిన కథలు కూడా సిద్ధంగా వున్నాయని చెప్పారు. దీంతో.. జక్కన్న తీయబోయే నెక్ట్స్ ప్రాజెక్ట్ ‘బాహుబలి-2’నే అని పుకార్లు ప్రారంభమయ్యాయి.
{youtube}2eNcRqlK4GQ{/youtube}
Related
