Friday, May 17, 2024
- Advertisement -

ప్రత్యేక హోదా రాదని తేలిపోయింది

- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి.. ఏపీ ప్రజల కల ఏంటంటే.. ప్రత్యేక హోదా అని అంతా చెబుతారు. అయితే.. అధికారంలోకి వచ్చాక.. ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్ ల సందర్భంగా.. ఈ విషయంపై ఎక్కడా.. పల్లెత్తు మాట కూడా మోడీ ప్రభుత్వం మాట్లాడలేదు.

ఎప్పుడైనా.. శంకుస్థాపనల కోసం ఆంధ్రాకు రావాల్సి వస్తే.. చేయాల్సినవి అన్నీ చేస్తాం అని మాత్రం చెప్పడం తప్ప.. ప్రత్యేకంపై స్పష్టత ఇచ్చిన సందర్భం కూడా లేదు.

కానీ.. రీసెంట్ గా.. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టినపుడు.. స్పెషల్ స్టేటస్ పై కనీసం అనౌన్స్ మెంట్ ఉంటుందని అంతా ఆశపడ్డారు. అదీ కాకుంటే.. నిధులైనా భారీ మొత్తంలో కేటాయిస్తారని నమ్మకం పెట్టుకున్నారు. కానీ.. అలాంటి సంకేతాలు ఏవీ లేకపోవడంతో… ఇకపై రాష్ట్రానికి దక్కేది కూడా నామమాత్రమే అన్న వాదన వినిపిస్తోంది.

కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలపై ఇంట్రెస్ట్ లేదనీ.. ఎంత సేపు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు లాంటి పెత్తనం చలాయించే రాష్ట్రాలపైనే కేంద్రం ఇంట్రెస్ట్ అనీ తెలుస్తోంది. అదీ కాదంటే.. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలపైనే కేంద్రం ఆలోచన అని కూడా అర్థమవుతోంది. అందుకే.. మరో మూడేళ్ల వరకూ.. అంటే పార్లమెంట్ తో పాటు.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే వరకూ.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాదు అన్న విషయం మాత్రం స్పష్టమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -