Saturday, April 27, 2024
- Advertisement -

బిజేపీ యాక్షన్ ప్లాన్.. 10వేల కిలోమీటర్లు !

- Advertisement -

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలపై బిజేపీ గట్టి ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలోని అన్నీ రాష్ట్రాలలో బిజేపీ ఎంతో కొంత మెరుగ్గానే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాలలో మాత్రం బిజేపీ పరిస్థితి ఎక్కడ వేసిన గొండలి అక్కడే ఉంది. తెలంగాణలో పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నప్పటికి.. ఏపీలో మాత్రం ఇంకా ఉనికి కోసం పాకులాడాల్సిన పరిస్థితే ఉంది. ఏపీలో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రజలు మాత్రం బిజేపీ వైపు చూడడం లేదు.

జి‌ఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ వంటి బలమైన నేతలు పార్టీలో ఉన్నప్పటికి బలం చాటుకోలేకపోతోంది. ప్రస్తుతం జనసేన పార్టీతో పొత్తులో ఉన్న బిజేపీ.. వచ్చే ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసే బరిలో దిగబోతున్నట్లు ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు కమలనాథులు. కాగా ఒకవేళ జనసేన దూరం అయితే బిజేపీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఎందుకంటే జనసేన అండతోనే ఏపీలో బలపడాలని చూస్తోంది కాషాయ పార్టీ. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన పొత్తు టీడీపీతో కూడా ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ జనసేన టీడీపీతో కలిస్తే బిజేపీతో జట్టు కట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే టీడీపీతో కలిసేందుకు బిజేపీ సిద్దంగా లేదు కాబట్టి.

ఈ నేపథ్యంలో కమలనాథులు సొంత బలం కోసం అరపడుతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ అందలేకుండా సొంతంగా పార్టీ బలం సాధిస్తే ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపొచ్చు అనే భావనలో కాషాయ పార్టీ శ్రేణులు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర ప్రజలతో మమేకం అయ్యేందుకు పాదయాత్రకు సిద్దమౌతున్నారు కమలనాథులు. రాష్ట్రమంతా ఏకంగా 10 వేల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టబోతున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఈ పాదయాత్రను 14 వేల గ్రామాల గుండా చేపట్టి ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే ఈ పాదయాత్ర లక్ష్యం అని అన్నారు. తమ పొత్తు ప్రజలతో, జనసేనతో అని మరోసారి కన్ఫర్మ్ చేశారు సోము వీర్రాజు. మరి సొంత బలాన్ని పెంపొందించుకునేందుకు బిజేపీ చేస్తున్న ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఎన్నికల బరిలో జూ.ఎన్టీఆర్.. చంద్రబాబు వ్యూహం అదే !

పవన్ చూపు అటువైపే.. హింట్ ఇచ్చాడా ?

అవన్నీ సామాన్యులకే.. నేతలకు కాదు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -