Sunday, May 19, 2024
- Advertisement -

భజన నాయకుడిగా కూడా పవన్ అట్టర్ ఫ్లాప్….. రంగులు తెలిసిపోతే ఎలా పవన్? .

- Advertisement -

ప్రత్యేక హొదా సంజీవిని కాదు అని చంద్రబాబు ప్లేట్ ఫిరాయించినప్పుడు…… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తూ మోడీకి సాగిలపడిపోతూ చంద్రబాబు మొదటి అడుగువేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడు, కాల్ మనీ సెక్స్ రాకెట్‌లో టిడిపి నేతల దురాగతాలు బయటపడినప్పుడు ప్రెస్ మీట్ లేదు, ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి, అక్రమాలు ఆందోళన రేకెత్తించే స్థాయిలో ఉన్నాయని కాగ్ చెప్పినప్పుడు, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ 1గా నిలిచినప్పుడు ప్రెస్ మీట్ పెట్టడు, వైస్సార్సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు అడ్డంగా కొనేస్తూ ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టడు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్కయినప్పుడు, ఆ తర్వాత హైదరాబాద్‌పై చట్టప్రకారం సీమాంధ్రులకు వచ్చిన పదేళ్ళ హక్కులను కాలరాస్తూ కెసీఆర్‌కి సాగిలపడిపోయి హైదరాబాద్‌ నుంచి బిచాణా ఎత్తేసినప్పుడు నో ప్రెస్ మీట్, నారాయణ కాలేజీల విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మాట్లాడడు, జగన్‌ని కార్నర్‌ని చేయడానికి మాత్రం వెంటనే ప్రెస్ మీట్లు పెడతాడు. బాబు మోసాలు, బాబు చేస్తున్న అన్యాయాలకు బలవుతున్నామని ఆందోళన చేస్తున్న ప్రజల మధ్యకు వెళ్ళి…..ఈ తప్పుకు అసలు కారణం వైఎస్ రాజశేఖరరెడ్డి అని కామెడీ చేస్తాడు.

చంద్రబాబుకు ఓట్లు వేయమని చెప్పింది పవన్. గెలిచిన తర్వాత బాబు తప్పులు చేస్తే నిలదీస్తా, ప్రశ్నిస్తా, ప్రజల కోసం పోరాటం చేస్తా అన్నాడు పవన్. కానీ నాలుగేళ్ళుగా పవన్ వైఖరి చూస్తూ ఉంటే మాత్రం వైఎస్ రాజశేఖరరెడ్డిని విమర్శించడానికి, వైఎస్ జగన్‌పై పోరాడడానికి, జగన్‌ని కార్నర్ చేయడానికి మాత్రమే రాజకీయాలు చేస్తున్నాడా అన్న అనుమానాలు వస్తున్నాయి. చంద్రబాబుపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను తగ్గించడానికే పవన్ రాజకీయాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రుణమాఫీలు, నిరుద్యోగ భృతి లాంటి హామీలను చంద్రబాబు కచ్చితంగా నెరవేరుస్తాడు అని ఎన్నికల సమయంలో చెప్పిన పవన్……అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆయా హామీలు ఎందుకు అమలు చేయలేదో? నమ్మి ఓట్లేసిన ప్రజలకు ఎందుకు ద్రోహం చేశాడో ఏనాడైనా తెలుసుకున్నాడా? బాబును ప్రశ్నించాడా?

అవన్నీ పక్కనపెట్టినా ఇప్పుడు కేంద్రంపైన పోరాటం చేయమని ఎవరిని డిమాండ్ చేయాలి? అధికారంలో ఉన్న చంద్రబాబునా? అధికారంలేని జగన్‌నా? మోడీకి ఓట్లేయండి…..మోడీ అన్నీ చేస్తాడు అని సీమాంధ్ర ఓటర్లను నమ్మించింది ఎవరు? ఇప్పుడు ఆ మోడీ సీమాంధ్ర ఓటర్లకు చిప్ప చూపిస్తూ ఉంటే బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? బాధ్యత తీసుకునే ధైర్యం, దమ్ము చంద్రబాబు, పవన్‌లకు అస్సలు లేవు. ఆ విషయాన్ని బాబు భజన మీడియా అధినేత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనే స్వయంగా చెప్పాడు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో….జగన్ తీసుకొస్తున్న ఒత్తిడి పుణ్యమా అని జగన్‌కి ప్రజల్లో ఎక్కడ మైలేజ్ వస్తుందో అని చంద్రబాబు కూడా తప్పక కేంద్రంపైన పోరాటం చేయాల్సిన పరిస్థితి…….కనీసం పోరాటం చేస్తున్నట్టుగా కనిపించాల్సిన పరిస్థితి బాబుకు తలెత్తిందని రాసుకొచ్చాడు. బాబు, పవన్‌ల రాజకీయాల వెనుక ఉన్న అసలు నిజం అదే. బాబు చేతకానితనం, అసమర్థ పాలన, అవినీతి వ్యవహారాలు, తన స్వార్థ ప్రయోజనాల కోసం హోదాతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను మోడీ దగ్గర తాకట్టుపెట్టడం లాంటి చర్యలతో 2014ఎన్నికల్లో కాంగ్రెస్‌కి పట్టిన గతే 2019లో టిడిపికి పట్టే పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఈ మొత్తం వ్యవహారం జగన్‌కి ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుందేమోనని, జగన్‌కి నష్టం చేయడానికి రాజకీయం చేయడం తప్పితే బాబు, పవన్‌ల పొలిటికల్ డ్రామాల, డ్రామా పోరాటల వెనక అర్థం వేరే ఏమైనా ఉందా? ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను గాలికొదిలేసి జగన్‌ని దెబ్బతీయడం కోసమే రాజకీయాలు చేసే బాబు, పవన్‌లే జగన్‌లా మేము రాజకీయ ప్రయోజనాల కోసం చూడట్లేదు. ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాం అని చెప్తూ ముందుగానే భుజాలు తడుముకుంటూ ఉంటారు.

ఇక పవన్ రాజకీయం ఎంత తెలివితక్కువగా ఉంటుందో ఒక్క విషయం పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుంది. జగన్ అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడితే చంద్రబాబు కూడా మద్దతిచ్చేలా చేస్తాను అని ఒక్క మాట చెప్పలేకపోయిన టీఆర్ఎస్ ఎంపి కవిత మాత్రం మద్దతిచ్చేలా చేస్తాడట. అసలు విషయం ఏంటంటే ఆ మధ్య కవితకు కృతజ్ఙతలు చెప్తూ పవన్ ట్వీట్ చేస్తే కవిత కనీసం పట్టించుకోలేదు. సాధారణంగా తమను ట్యాగ్ చేస్తూ అభినందించిన ఇతర సెలబ్రిటీస్‌ ట్వీట్స్‌కి సెలబ్రిటీస్ కచ్చితంగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. కానీ కవిత మాత్రం పవన్‌ని పూర్తిగా లైట్ తీసుకుంది. ఆ విషయం తెలిసికూడా ఇప్పుడు మరోసారి కవిత మద్దతు కూడగడతా అని మాట్లాడి కామెడీ అయిపోయాడు. కనీసం బాబు భజనసేనుడిగా కూడా పనికిరానని నిరూపించుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -