Saturday, May 18, 2024
- Advertisement -

హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కూడా పిచ్చిలేపుతున్న పవన్ తిక్క… భరించలేనంత

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న హీరోలందరిలోకి…. మా హీరోని విమర్శిస్తే తంతాం…. అనేలాంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎక్కువ మంది పవన్‌కే ఉన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాలకు ఓపెనింగ్స్ కలెక్షన్స్ మాత్రం అదిరిపోతూ ఉంటాయి. పవన్ మూఢాభిమానులకు ఆయన సినిమా తప్ప ఇంకేమీ అవసరం లేదు మరి. ఆయన సినిమాలు ఎలా ఉన్నా? యాక్టింగ్ ఏమీ రాకపోయినా, కెమేరా ఎదురుగా అటూ ఇటూ నడుస్తూ అదే డ్యాన్స్ అనుకోమన్నా, కష్టం గురించి ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడేది ఎక్కువ, సినిమాలో కనిపించేది తక్కవ అయినా పవన్ ఫ్యాన్స్‌కి మాత్రం పవన్‌కి వీరాభిమానులుగా ఉండడంలో అదో తుత్తి. అలాగే పవన్‌కి కూడా ఈ ఫ్యాన్స్ అందరూ ఎలాంటి సినిమా అయినా చూస్తారన్న గట్టి నమ్మకం ఏదో ఉన్నట్టుంది…. అందుకే పాత కాలం నాటి తమిళ కథలను అత్యంత తక్కువ క్వాలిటీతో ఛీప్‌గా చుట్టేస్తూ ఉంటాడు. అఫ్కోర్స్ తను మాత్రం సినిమాకు తక్కువలో తక్కువ ఇరవై కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటాడు. డైరెక్టర్‌తో సహా మిగతా అందరికీ కూడా చాలా తక్కువ డబ్బులు ఇస్తారు. పవర్ స్టార్ లాంటి క్రేజ్ ఉన్న నటుడితో సినిమా చేయాలంటే ఆ మాత్రం త్యాగం చేయాలంటారు. తొలి సినిమా పవర్‌కి యాభై లక్షలు తీసుకున్న బాబీకి మలి సిినిమా సర్దార్ సినిమాకు గాను అంతకంటే తక్కువిచ్చారని బాబీ టీం చెప్తూ ఉంటారు.

అయితే సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు సినిమాల వళ్ళ పవన్‌కి మాత్రం సౌత్ ఇండియాలోనే ఏ ఇతర హీరోకీ రానంత భారీగా డబ్బులు వచ్చాయి. అయితే ఆ సినిమాలు కొన్న బయ్యర్స్ రోడ్డున పడ్డారు. నిరాహార దీక్షలు కూడా చేశారు. డబ్బులంటే అస్సలు ఇష్టం లేదు, మాట కోసం ప్రాణాలిస్తాను, మనీ కంటే మానవత్వమే మిన్న అన్న హీరోగారు మాత్రం నిరాహారా దీక్ష చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌ని ఆదుకోకపోగా బెదిరింపులకు దిగాడు. ఆ విషయాన్ని కూడా ఆ డిస్ట్రిబ్యూలర్సే స్వయంగా చెప్పారు. పవన్ చుట్టూ ఉన్న మాఫియా మమ్మల్ని బెదిరిస్తుందని వాపోయారు. అఫ్కోర్స్ తెలుగులో బాబు భజన మీడియాదే ఆదిపత్యం కాబట్టి….. ప్రస్తుతానికి తన అవసరాల రీత్యా బాబుగోరికి పవన్ వంత పాడుతున్నాడు కాబట్టి బాబుగోరి భజన మీడియా ఇలాంటి వార్తలను సైలెంట్ చేస్తుందనుకోండి. ఇక్కడ ప్రజల కోసమే పవన్-బాబుల బంధం అని వాదించేవాళ్ళు ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పి ఆ తర్వాత మాట్లాడాలి. పవన్-బాబుల బంధం వళ్ళ ఆంధ్రప్రదేశ్‌కి ఒరిగిందేంటో…. కేంద్రం నుంచి వీళ్ళు సాధించింది ఏంటో చెప్పి ఆ తర్వాత మాట్లాడమనండి. పాలిటిక్స్‌లో ఆ రకంగా సీమాంధ్రులను పూర్తిగా ముంచిన పవన్ తన రెమ్యూనరేషన్‌ని, వాటాలను మాత్రం భారీగా పెంచుకుంటూ సినిమాల విషయంలో కూడా ప్రేక్షకులను నిండా ముంచుతున్నాడు. ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో గొప్పగా జీవిస్తూ మాట్లాడి జనాలను అట్రాక్ట్ చేసే పవన్ సినిమాలలో మాత్రం కనీస స్థాయిలో కూడా నటించలేకపోతున్నాడు…. ఎందుకో మరి? సినిమాల్లో కంటే కూడా నిజ జీవితంలోనే పవన్ గొప్ప నటుడన్నది ఇండస్ట్రీ వర్గాల మాట.

ఆ విషయం పక్కనపెడితే ఇప్పుడు పవన్ తన హార్డ్ కోర్ ఫ్యాన్స్‌కి కూడా పిచ్చెక్కిపోయే డెసిషన్ తీసుకున్నాడు. ఆ మధ్య ఎన్టీఆర్ సినిమా ఊసరవెల్లి వచ్చింది గుర్తుందా? గుర్తుండే స్థాయిలో ఆ సినిమా ఆడలేదులే. ఆ సినిమాను కూడా ఒక విదేశీ సినిమాను ఎత్తుకొచ్చాడు సురేందర్‌రెడ్డి. అయితే తమిళ జనాలు ఆ ఒరిజినల్ విదేశీ సిినిమాను చూశారో… లేక ఊసరవెల్లిని చూశారో కానీ ఆ కథకు కాసిన్ని మార్పులు చేర్పులు చేసి వేదాళం అన్న సినిమాను తీశారు. ఇప్పుడు ఆ వేదాళం సిినిమాను తెలుగులో తెరకెక్కించడానికి రెడీ అయ్యాడు పవన్. మామూలుగా అయితే డైరెక్టర్స్ తెరకెక్కిస్తారు. కానీ పవన్ సినిమాలకు మాత్రం ఆయనే అసలు సిసలు డైరెక్టర్ కాబట్టి ఆయన పేరే చెప్పాలి. ఇప్పుడు ఈ వార్త అధికారికంగా బయటికి వచ్చింది. జనవరిలో షూటింగ్‌కి కూడా వెళ్తున్నారట. సర్దార్, కాటమరాయుడు సినిమాలు కొన్నవాళ్ళు ఇంకా కోలుకోలేదు. ఆ సినిమాలు చూసిన ఫ్యాన్స్ కూడా ఇంకా తేరుకోలేదు. అంతలోనే ఈ రొటీన్ రొడ్డకొట్టుడు కథతో పవన్ సినిమా చేయబోతున్నాడన్న విషయం ఫ్యాన్స్ కూడా భరించలేకపోతున్నారు. అందుకే సోషల్ మీడియా ద్వారా పవన్‌కి సలహాలు ఇస్తున్నారు. అఫ్కోర్స్……. ఇంకొకరి సలహాలను పవన్ తీసుకోడన్న నిజం వాళ్ళకు తెలియదనుకోండి. వేదాళం సినిమాను పవన్ తెరకెక్కించడం అయితే ఖాయం. మరి ఈ సారి అయినా తెలుగు సినిమా బయ్యర్స్, డిస్ట్రిబ్యూటర్స్ జాగ్రత్తపడతారా? ఇలాంటి సినిమాల్లో యాక్ట్ చేసినందుకు పవన్‌కి ఇరవై కోట్లకు పైగానే ముడుతోంది. కానీ సినిమా కొన్నవాళ్ళు, టికెట్ కొన్నవాళ్ళు మాత్రం నిండా మునుగుతున్నారు. పవన్ ఎలాగూ మారడు. కనీసం బయ్యర్స్ అయినా జాగ్రత్తపడతారేమో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -