Friday, May 3, 2024
- Advertisement -

రైతుల కోసం లారెన్స్ ఏం చేస్తున్నాడో తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -
Raghava Lawrence Helps The Needy People

లారెన్స్‌.. కేవలం డాన్స్ మాస్టర్ గానే కాకుండా.. హీరోగా, దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో లారెన్స్‌‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే ఎవరినా కష్టాలు ఉంటే.. లారెన్స్‌ వెంటనే స్పందించి వారికి సహయం చేస్తారు. మరోసారి లారెన్స్ తన గొప్ప మనసును చాటుకున్నారు.

ఇటివలే యువకుల సంక్షేమానికి రూ.కోటి విరాళం ప్రకటించారు. అలాగే మొన్న జరిగిన జల్లికట్టు కోసం ఉద్యమిస్తున్న యువతకు ఆహారం సమకూర్చడానికి కోటి రూపాయలు వరకూ ఖర్చు చేశాడు. ఇప్పుడు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల కోసం నిధి సేకరిస్తున్నారు. దీనిపై లారెన్స్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న ఓ రైతు కుటుంబం ఇటీవల నన్ను కలసింది. వెంటనే వారికి రూ.3 లక్షలు ఇచ్చాను. కానీ అది శాశ్వత పరిష్కారం కాదు.

తమిళనాడులో ఇప్పటి వరకు 271 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆ కుటుంబాలన్నీ వీధిన పడుతున్నాయి. వారికి సహకరించాలని నేను ప్రభుత్వాన్ని కోరను. 271 కుటుంబాలకు వ్యక్తిగతంగా నేను నా శక్తి కొద్దీ సాయం అందజేస్తా. విదేశాల్లో పలు కార్యక్రమాలు నిర్వహించి నిధి సేకరిస్తా. సినిమా పరిశ్రమ కూడా సహకరిస్తుందని బావిస్తున్నా” అని చెప్పుకోచాడు లారెన్స్. నిజంగా లారెన్స్ ను మెచ్చుకోవాల్సిందే.

{youtube}H1TR5CTkhuA{/youtube}

Related

  1. జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!
  2. బిత్తిరి స‌త్తికి చుక్క‌లు చూపించిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌!
  3. మాజీ లవర్ ని కోరిక తీర్చాల‌ని బ్లాక్ మెయిల్ చేసిన యువ‌తి.. చివర్లో ఊహించని ట్విస్ట్
  4. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే వార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -