Sunday, May 19, 2024
- Advertisement -

ప్రపంచంలో ఈవింతను మీరు ఎప్పుడైనా చూశారా..

- Advertisement -

మన పెద్దలు ఎప్పుడూ ఓ మాట చెబుతుంటారు. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని. అది సినిమాల్లో తప్ప ఎక్కడో కాని సాధ్యం కాదు. కాని మనిషిని పోలిన మనుషులు 28మంది ఉంటారని ఓ పరిశోధన నిజం చేసింది. ఇందుల్లో వారంతా 28 దేశాలకు చెందినవారు కావడం నిజంగా విశేషమే అని చెప్పాలి. అయితే ఇదంతా నిజమే నంటూ ఓ గ్రూప్ ఫొటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ప్రపంచ 8వ వింతగా దీనిని చెబుతున్నారు.

నిజంగా ఇది నిజమేనా అని ఓసారి చెక్ చేసినట్లయితే… నమ్మలేని నిజాలు చాలా తెలిసాయి. విచారణలో ఈ ఫోటో దీని డిస్క్రిప్షన్ జనవరి 13వ తేదీనే చెక్4స్పామ్ కు రిపోర్ట్ చేయడమైనది. అప్పట్లో బెంగుళూరు మిర్రర్ అనే వెబ్ సైట్ కూడా దీని బండారాన్ని బయటపెట్టింది. నిశితంగా పరిశీలిస్తే.. ఈ ఫోటో అసలు రంగును ఈజీగా పసిగట్టేయ్యొచ్చు. కుడిపక్కన చివర్లో చేతిలో రోజాపువ్వును పట్టుకున్న నీలం రంగు చొక్కా మనిషిని గమనిస్తే.. అతడి శరీరం రంగులో స్పష్టమైన తేడాను గుర్తించవచ్చు. ‘ఇమేజ్ ఎడిటింగ్ సాఫ్ట్ వేర్’ ద్వారా ఈ ఫోటో మీద చేతివాటం జరిగినట్లు తేలిపోతుంది. సో.. ఏదో ఒక గ్రూప్ ఫోటోలోని 28 మంది మొహాలకు ఒకే మాస్క్ ని పేస్ట్ చేసి మాయ చేశారన్నది వాస్తవం! సో.. ఇది ఎయిత్ వండర్ కాదు.. జస్ట్ ఫోటోషాప్ వండర్. ఇలాంటివి కూడా సోషల్ మీడియాలో మనకు అక్కడక్కడ తారసపడుతుంటాయి. జర చూస్కోరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -