Sunday, May 19, 2024
- Advertisement -

పిల్లలకు పరిచయాలు చేస్తున్నారా?

- Advertisement -

ఇప్పుడు చాలా వరకు చిన్న కుటుంబాలే ఉంటున్నాయి. నాలుగ్గోడలు,పుస్తకాలతో కుస్తీలు,ఆన్ లైన్ గేమ్స్ కి పిల్లలు పరిమితం అయ్యిపోతున్నారు.

దాని వలన కొంత కాలానికి వాళ్ళ జీవితం యాంత్రికంగా మారుతుంది. చుట్టూ ఉన్న వారితో సంబందాల గురించి వారికి తెలియదు.

మీ బంధుమిత్రులలో మీ చిన్నారి వయస్సు ఉన్న వారిని మీ చిన్నారితో స్నేహం చేయించండి. ఈ తీరు మీ కుటుంబ పరిదిని పెంచుతుంది. అవకాశాల కోసం,ఆశయాల కోసం పరుగెత్తే ఈ క్రమంలో పండుగలు,పబ్బాలకు హాజరు అయ్యే పరిస్థితి చాలా మందికి లేదు. భార్య భర్తల్లో ఒక్కరైన పిల్లలను ఆ వేడుకలకు తీసుకువెళ్ళే విధంగా చూసుకోవాలి.

అలాగే మీ సహాధ్యాయి ఇళ్ళకు తీసుకువెళ్ళండి. దాని వల్ల వారి పిల్లలతో పరిచయాలు పెరుగుతాయి. దీని కోసం అప్పుడప్పుడు గెట్ టు గెదర్ లు ఏర్పాటు చేసుకోవటం వలన కూడా పిల్లలకు పరిచయాలు పెరుగుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -