Saturday, April 27, 2024
- Advertisement -

కుటుంబ‌ ఆస్తులను ప్ర‌క‌టించిన మంత్రి లోకేష్‌….

- Advertisement -

నారావారి ఆస్తుల వివ‌రాల‌ను మంత్రి లోకేష్ ప్ర‌క‌టించారు. నాలుగు ద‌శాబ్దాలుగా రాజ‌కీయాల్లో ఉన్న బాబు ఆస్తులు కేవ‌లం రూ.34 ల‌క్ష‌లేనంట‌. మనవడు దేవాన్ష్ పేరుతో మాత్రం రూ. 11.54 కోట్ల ఆస్తులున్నాయి. ఈ లెక్క‌లు ఎవరైనా ఎవ‌రైనా న‌మ్ముతారా …న‌మ్మాల్సిందే…ఎందుకంటె లోకేష్ బాబు ప్ర‌క‌టించారు క‌దా.

తమ కుటుంబం ఆస్తులన్నీ పాలు, కూరగాయలమ్మే ఓ పద్దతిగా సంపాదించినట్లు చెప్పారు. తమకు కూరగాయలు, పాల వ్యాపారం తప్ప ఇతరత్రా వ్యాపారాలేవీ లేవని, కొన్ని ఆస్తులపై అద్దెలు మాత్రం వస్తున్నాయట. ముందుగా ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన ఆస్తులను ప్రకటించాలని సవాలు విసిరారు.

తన తండ్రి, ముఖ్యమంత్రైన చంద్రబాబునాయుడుకు రూ. 34 లక్షల ఆస్తి ఉందన్నారు. తనకు రూ. 25.25 కోట్లు, బ్రాహ్మణి ఆస్తి రూ. 25 కోట్లు, తల్లి భువనేశ్వరి పేరుతో రూ. 25 కోట్లు, కొడుకు దేవాన్ష్ పేరుతో రూ. 11.54 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. చంద్రబాబుకు రూ. 3.58 కోట్ల అప్పులున్నట్లు కూడా చెప్పారు. కొత్త ఇంటని కట్టినందుకు బ్యాంకులో రుణం తీసుకున్నారట.

వార‌స‌త్వ రాజ‌కీయాల‌గురించి చెప్పుకొచ్చారు చిన‌బాబు. వారసత్వంగా ఫీల్డ్ లోకి రావటానికి ఎక్కువ అవకాశాలున్నా, నిలబెట్టుకోవాల్సింది మాత్ర సామర్ధ్యంతోనే కదా అంటూ ప్రశ్నించారు. అలాంటి లోకేష్ ఎందుకు ఎమ్మెల్సీ అయి దొంగ‌దారిన మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారో దానిగురించి చెప్తే బాగుంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -