Thursday, May 2, 2024
- Advertisement -

కర్ణాటక వక్ఫ్​ బోర్డు కీలక ప్రకటన.. లౌడ్​ స్పీకర్ల వినియోగంపై ఆంక్షలు..!

- Advertisement -

మసీదు, దర్గాల్లో లౌడ్​ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక వక్ఫ్ బోర్డు ఆంక్షలు విధించింది. రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు ఎలాంటి స్పీకర్లను వినియోగించరాదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ ఈనెల 9న ఉత్తర్వులు​ జారీ చేసింది.

ఈ ఉత్తర్వులపై బెంగళూరులోని జామియా మసీద్​ ఇమామ్​ మఖ్​సూద్​ ఇమ్రాన్ స్పందించారు. నిర్ణయాన్ని సమీక్షించాలని బోర్డుకు విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. త్వరలో రంజాన్​ రానున్న నేపథ్యంలో సూర్యోదయం వేళలను దృష్టిలో పెట్టుకుని ఆంక్షలను ఉదయం ఐదు గంటల వరకే పరిమితం చేయాలని కోరినట్లు తెలిపారు.

మసీదులు, దర్గాల్లో వినియోగించే లౌడ్​ స్పీకర్ల కారణంగా సమీప ప్రాంతాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని గుర్తించాము. ఈ విషయంపై 2017 జులై 10న తొలిసారి ప్రకటన విడుదల చేశాము. ఆజాన్​కు మాత్రమే లౌడ్​స్పీకర్ల వినియోగానికి అనుమతిస్తున్నాము అని కర్ణాటక వక్ఫ్​ బోర్డు తెలిపింది.

విషాదంలో ఆ గ్రామం.. సెప్టిక్‌లో పడి ఐదుగురు దుర్మరణం!

శాసనసభలో అదరగొట్టిన బాలరాజు.. ఏమన్నారు అంటే..!

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -