Saturday, May 4, 2024
- Advertisement -

చంద్రబాబు నైజం తెలుగుజాతికి అర్థమైందా?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అత్యంత అనుభవజ్ఙుడిని అని చెప్పుకునే నారా చంద్రబాబునాయుడి నైజం ఇప్పుడు తెలుగు జాతి మొత్తానికీ స్పష్టంగా అర్థమైందా? చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయో తెలిసొస్తోందా? స్వయంగా నారా చంద్రబాబు నాయుడి కోసమే జర్నలిస్ట్‌ని అని స్పష్టంగా అర్థమయ్యేలా చేసే ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ చెప్పినట్టుగా వైఎస్ రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల విషయంలో బెస్ట్ అయితే నారా చంద్రబాబు నాయుడు రాజకీయం చేయడం విషయంలో ది బెస్ట్. తాజాగా మరోసారి ఆ విషయం తెలుగు ప్రజలందరికీ అర్థమైంది.

నందమూరి తారక రామారావు పదవిని, పార్టీని లాక్కున్న చంద్రబాబు ఆయనకు జీవిత చరమాంకంలో తీరని ఆవేదన మిగిల్చాడు. ఆ తర్వాత బ్రతికున్నంత కాలం…….. చివరి రోజు కూడా చంద్రబాబు అసలు మనిషే కాదు అని తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు ఎన్టీఆర్. తండ్రిని చంపుకున్న ఔరంగజేబును మించిన రాక్షసుడు చంద్రబాబు అని ఎన్టీఆర్ అన్నాడంటే చంద్రబాబును ఎన్టీఆర్ ఏ స్థాయిలో ద్వేషించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితేనేం ఎన్టీఆర్ చనిపోయిన వెంటనే చంద్రబాబులోని రాజకీయ నాయకుడు మేల్కొన్నాడు. ఎన్టీఆర్ ఇమేజ్‌ని, ప్రజల్లో వచ్చిన సానుభూతిని తాను క్యాష్ చేసుకున్నాడు చంద్రబాబు. ఈ రోజుకీ ఆ ఎన్టీఆర్ బొమ్మ చూపించుకునే ఓట్లు కొల్లగొడుతూ ఉన్నాడు. ఆనాడు అంటే మీడియా మొత్తం చంద్రబాబు గుప్పిట్లో ఉంది కాబట్టి అలా చేశాడని……….. ఇప్పుడు అలాంటివి సాధ్యం కాదని ఎన్టీఆర్ చనిపోయాక చంద్రబాబు చేసిన రాజకీయం గురించి తెలిసిన సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతూ ఉంటారు.

అయితే అలాంటి వాళ్ళ అభిప్రాయాలు తప్పని మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నాడు. నందమూరి హరికృష్ణ కూడా చివరి క్షణం వరకూ చంద్రబాబును వ్యతిరేకించాడు. అలాగే హరికృష్ణ కుమారుడు ఎన్టీఆర్ అయితే చంద్రబాబు, లోకేష్‌ల పొడకూడా గిట్టదు అనే స్థాయిలో దూరం పాటించాడు. 2009 ఎన్నికల్లో తనను వాడుకుని …….ఆ తర్వాత లోకేష్‌కి ఎక్కడ పోటీ అవుతాడో అని చెప్పి పార్టీకి, నందమూరి అభిమానులకు ఎన్టీఆర్‌ని దూరం చేయాలని చూసిన చంద్రబాబు అంటే ఎన్టీఆర్‌కి చాలా కోపం. బాద్షా సినిమా టైంలో ఎన్టీఆర్ సినిమా చూడొద్దని బల్క్ మెస్సేజ్‌లు పంపించిన విషయం అప్పుడే ఎన్టీఆర్ మర్చిపోగలడా? అసలు నిజాలు ఇలా ఉన్నాయి. అయితేనేం చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన ఇమేజ్‌ని పూర్తిగా తన సొంతం చేసుకున్నట్టుగా ఇప్పుడు హరికృష్ణ విషయంలో కూడా సక్సెస్ అయ్యాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు చంద్రబాబు కోసమే వార్తా కథనాలు వండివార్చాయన్నది నిఖార్సైన నిజం. హరికృష్ణ చనిపోయిన మరుక్షణం నుంచీ మీడియా మేనేజ్‌మెంట్‌తో సహా చంద్రబాబు యాక్టివిటీస్ అన్నింటినీ ఒక్కసారి పరిశీలిస్తే చాలు……….చంద్రబాబు రాజకీయం ఎలా ఉంటుందే ఇట్టే అర్థమైపోతుంది. ప్రజలను ప్రభావితం చేసే నాయకత్వ లక్షణాల విషయంలో ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లతో పాటు తనకంటే చాలా జూనియర్ అయిన వైఎస్ జగన్ స్థాయి నైపుణ్యం కూడా చంద్రబాబుకు లేదు. అయితేనేం మీడియాను అడ్డుపెట్టుకుని……..ఎలాంటి పరిస్థితులనైనా రాజకీయంగా తనకు ఉపయోగపడేలా చేసుకోవడంలో మాత్రం దేశంలోనే చంద్రబాబును మించిన నాయకుడు లేడని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -