Saturday, May 18, 2024
- Advertisement -

టెస్ట్ మ్యాచ్ లను టాస్ వేయకుండానే మొదలు పెట్టాలట!

- Advertisement -

ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్లు ఒక కొత్త విషయాన్ని రైజ్ చేస్తున్నారు. టెస్టు మ్యాచ్ లలో టాస్ వద్దు అని వారు అంటున్నారు. టాస్ వేయకుండానే మ్యాచ్ ను మొదలు పెట్టాలని అంటున్నారు.

ఒకరు కాదు.. ఆసీస్ మాజీకెప్టెన్లు.. ప్రపంచ ప్రసిద్ధ ఆటగాళ్లు అయిన స్టీవ్ వా, రికీ పాంటింగ్ తదితరులు అంతా ఇదే మాట చెబుతున్నారు. అదేంటి..? టాస్ వేయకుండా మ్యాచ్ ను మొదలు పెట్టడం ఏమిటి? టాస్ వేసే కదా.. మ్యాచ్ లో బ్యాటింగ్ ఎవరు మొదలు పెట్టాలని నిర్ణయించేది అలాగే కదా… అనే అనుకొంటాం. టాస్ వేయకుండా మ్యాచ్ ప్రారంభం ఎలా? అంటే.. ఆసీస్ మాజీ కెప్టెన్లు దానికో పరిష్కార మార్గం చెబుతున్నారు.

టెస్టు మ్యాచ్ లలో టాస్ వద్దని… పర్యాటకజట్టు కెప్టెన్ ఇష్టానుసారం బ్యాటింగ్ లేదా బౌలింగ్ ను ఎంచుకొనే అవకాశాన్ని ఇవ్వాలని వీరు అంటున్నారు. అంటే.. ఆతిధ్య జట్టు కాకుండా… పర్యాటక జట్టు కెప్టెన్ కోరుకొన్నట్టుగా మ్యాచ్ ప్రారంభం అవుతుందనమాట. ఈ ఆలోచన బాగానే ఉన్నట్టుంది. ఇప్పటికే మ్యాచ్ ఆడే పిచ్ ను ఆతిధ్య జట్టు కెప్టెన్ ఇష్ట ప్రకారం తయారు చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంల టాస్ ను పర్యాటక జట్టు కెప్టెన్ క వదిలిపెట్టాలని అంటున్నారు.

అయితే ఆసీస్ ఆటగాళ్ల సూచన బాగానే ఉన్నప్పటికీ.. వారు ఈ సూచన చేయడం వెనుక ఆసక్తికరమైన రీజనే ఉంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా యాషెష్ సీరిస్ లో ఆసీస్ చిత్తుగా ఓడింది. ఈ నేపథ్యంలో ఆసీస్ కెప్టెన్ల కు ఇది గుర్తుచ్చింది. టాస్ ఓడిపోవడం వల్లనే తమ జట్టు ఓటమి పాలయ్యిందనే భావనతో ఉన్న ఆసీస్ కెప్టెన్లు టెస్టుల్లో పర్యాటక జట్టు ఇష్ట ప్రకారం మ్యాచ్ ను ప్రారంభించాలన్న ఆలోచనను వ్యక్తం చేశారు. మరి తమ దాకా వచ్చే సరికి ఆసీస్ ఆటగాళ్లకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నట్టుగా ఉన్నాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -