Sunday, May 5, 2024
- Advertisement -

ఎన్టీఆర్ వెన్నుపోటు వెంటనే హరికృష్ణకు బాబు ఇచ్చిన వెన్నుపోటు షాక్ ఏంటంటే?

- Advertisement -

హరికృష్ణకు ఆయన తండ్రి ఎన్టీఆర్ అంటే వల్లమాలిన అభిమానం. అలాగే ఎన్టీఆర్‌కి కూడా హరికృష్ణ అంటే ఇతర కొడుకులు అందరికంటే వాత్సల్యం ఎక్కువ. కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ లక్షణాలను పుణికిపుచ్చుకున్న కొడుకు హరికృష్ణ. తండ్రికి అన్ని విషయాల్లోనూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఎన్టీఆర్ కోసం ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ పడనంత కష్టం హరికృష్ణ పడ్డాడు. అయితే లక్ష్మీపార్వతిని బూచీగా చూపించి ఇప్పటి నంబర్ ఒన్ పత్రిక మీడియా అధినేత, అలాగే ఓపెన్ హార్ట్ సర్జన్ మీడియా పెద్దతో కలిసి అధికారం కోసం చంద్రబాబు ఆడిన డ్రామాను అర్థం చేసుకోలేకపోయాడు. కేవలం అధికార కక్కుర్తితో ఎన్టీఆర్‌కి ద్రోహం చేసిన వెన్నుపోటు ఎపిసోడ్‌లో హరికృష్ణ పావుగా మారాడు.

మంత్రి పదవి ఆశ చూపించిన చంద్రబాబుకు మద్దతుగా నిలిచాడు. అయితే తల్లికి అన్నం పెట్టని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానంటే ఎవరైనా నమ్ముతారా? కానీ హరికృష్ణ నమ్మాడు. అయితే చంద్రబాబు మాత్రం తన నైజాన్ని నిరూపించుకున్నాడు. వెన్నుపోటు ఎపిసోడ్ తర్వాత ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు హరికృష్ణను రవాణా శాఖ మంత్రిని చేశాడు. కానీ నందమూరి కుటంబ సభ్యులు ఎవరు రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్నా టిడిపి పూర్తిగా తన చేతుల్లోకి, తన కుటుంబం చేతుల్లోకి రావడం కష్టం అన్న థియరీ చంద్రబాబుది. అలాగే వెన్నుపోటుతో పదవి దక్కించుకన్న చంద్రబాబు తనను కూడా అలాగే ఎవరైనా వెన్నుపోటు పొడుస్తారనే భయంతో ఎమ్మెల్యేల బలం ఉన్న హరికృష్ణను పూర్తిగా సైడ్ ట్రాక్ చేయడానికి ప్రయత్నించాడు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆరు నెలల తర్వాత కాలంలో ఎమ్మెల్యేగా గెలవకపోతే హరికృష్ణ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే హరికృష్ణకు ఎమ్మెల్యేగా నిలిచే అవకాశం లేకుండా చేశాడు. ఎమ్మెల్యే కాలేదన్న నెపంతో ఆరు నెలల లోపే హరికృష్ణను మంత్రి పదవి నుంచి తొలగించాడు.

ఆ తర్వాత ఎన్టీఆర్ గెలిచిన హిందూపురం నియోజకవర్గానికి వెంటనే ఎన్నికలు రాకుండా కూడా కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వ్యవస్థలను మేనేజ్ చేశాడు చంద్రబాబు. సంవత్సరాల కాలం తర్వాత హిందూపురం నుంచి హరికృష్ణ ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ చంద్రబాబు మాత్రం ఆ తర్వాత మళ్ళీ హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చింది లేదు. ఆ రకంగా ఎంతో ప్రేమించిన తండ్రిని కూడా మోసం చేసిన హరికృష్ణ రాజకీయ జీవితానికి కేవలం ఆరు నెలలోపు మంత్రి పదవితో ముగింపు పలికేశాడు చంద్రబాబు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్న చంద్రబాబు……..ఆ వెంటనే నందమూరి కుటుంబంలోని మరో ముఖ్యుడైన హరికృష్ణను కూడా వెన్నుపోటు రాజకీయంతోనే అణచేశాడు చంద్రబాబు. మీడియా మద్దతు పుణ్యమాని చంద్రబాబు ఏం చేసినా చెల్లిపోయిన కాలం కాబట్టి తన ఆవేదనను హరికృష్ణ ఎంతగా ప్రజలకు వినిపించినప్పటికీ చంద్రబాబు మీడియా మేనేజ్‌మెంట్ ముందు హరికృష్ణ ఆవేదన మూగరోదనే అయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -