Sunday, May 19, 2024
- Advertisement -

జగన్ ప్రజా సంకల్ప యాత్ర సాధించిన బిగ్గెస్ట్ సక్సెస్ ఇదే…… అతి పెద్ద సంకటంలో పచ్చ బ్యాచ్

- Advertisement -

జగన్ తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ మొదలవుతుందా? ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళను కాళ్ళు బయటపెట్టకుండా నిర్బంధించగలిగిన చంద్రబాబు వ్యూహాలను ఎదుర్కుని జగన్ నడవగలడా? అన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ దిగ్విజయంగా ‘ప్రజా సంకల్పయాత్ర’ను కొనసాగిస్తున్నాడు జగన్. అయితే వెయ్యి కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రతో జగన్ ఏం సాధించినట్టు? లక్ష్యం దిశగా అడుగులు పడుతున్నాయా? అన్న చర్చ ప్రధానంగా నడుస్తోంది. జగన్ ప్రజా సంకల్ప యాత్ర ఫలితమేంటి అనే విషయం 2019 ఎన్నికల్లో తేలుతుంది. అయితే అంతకుముందే మరో గొప్ప విజయం సాధించాడు వైఎస్ జగన్.

మామూలుగా అయితే జగన్ తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని, చేసిన ప్రతి విమర్శనూ కూడా ఘాటుగా తిప్పికొట్టడం పచ్చ బ్యాచ్ అలవాటు. మీడియా బలం కూడా వాళ్ళకే ఉన్న నేపథ్యంలో జగన్ మాటలను వక్రీకరించడంలో చాలా సార్లు సక్సెస్ అయ్యారు కూడా. నంద్యాల ఫలితాలు మరోసారి ఆ విషయాన్ని నిరూపించాయి. కృష్ణా-గుంటూరు జిల్లాల్లో రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదు…..చంద్రబాబు చేస్తున్న అక్రమాలకు మాత్రమే వ్యతిరేకం అని జగన్ ఎంత మొత్తుకున్నా అమరావతి వ్యతిరేకి జగన్ అని ముద్రవేశారు. ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు అన్యాయం చేసినందుకు, ప్రత్యేక హోదాను ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడడానికి తాకట్టు పెట్టినందుకు చంద్రబాబుకు ఏ శిక్ష వేసినా తప్పులేదు అని జగన్ మాట్లాడితే జగన్ మాటల్లోని ఆవేధనని పక్కనపెట్టేసి చంద్రబాబుకు ఉరిశిక్ష వేయమంటున్న ఫ్యాక్షనిస్ట్ జగన్ అని ప్రచారం చేశారు. ఇక నిరాహార దీక్షల విషయంలో అయితే ఇష్టారీతిన మాట్లాడేశారు. అయితే ఫైనల్‌గా మాత్రం అలాంటి దుష్ప్రచారాలకు అవకాశం లేని ఒక స్థితిని జగన్ సాధించాడు.

ప్రజా సంకల్ప యాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్ సాధించిన ఆ అద్భుత విజయాన్ని కూడా ప్రస్తావించాలి. ఇప్పటి వరకూ జగన్ చేసిన ప్రతి కార్యక్రమం, విమర్శలనూ తిప్పికొట్టిన చంద్రబాబు అండ్ కో జగన్ పాదయాత్ర విషయంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు, లోకేష్, పవన్‌లతో పాటు పచ్చ మీడియా అంతా కూడా జగన్ పాదయాత్రను విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నాయి. వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్‌పై అన్ని వర్గాల ప్రజలు, విశ్లేషకులు ప్రశంశల వర్షం కురిపించారు. అలాంటి సందర్భంలో అంతే స్థాయిలో……అంతకు మించి జగన్‌పై విమర్శల వర్షం కురిపించడం పచ్చ బ్యాచ్ నైజం. జగన్‌కి మైలైజ్ రాకుండా చేయడం కోసం వ్యతిరేక ప్రచారం ఓ స్థాయిలో చేస్తారు. అయితే ఈ సారి మాత్రం అలాంటి ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించలేదు. చంద్రబాబుతో సహా ఎవ్వరూ కూడా జగన్ ప్రజా సంకల్పయాత్రను విమర్శించే ధైర్యం చేయలేదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ప్రజా సంకల్పయాత్రతో వైఎస్ జగన్ సాధించిన గొప్ప విజయం ఇదే అని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -