Sunday, May 19, 2024
- Advertisement -

గూగుల్ ట్రెండ్స్ః చంద్రబాబు పాలన కంటే జగన్ పాదయాత్రకే ప్రాధాన్యం

- Advertisement -

గూగుల్ ట్రెండ్స్ టిడిపి వర్గాలకు షాక్‌ ఇచ్చాయి. టెక్నో సిఎం అని చెప్పుకునే చంద్రబాబు పాలనకంటే కూడా నెటిజనులు జగన్ పాదయాత్రపైనే ఆసక్తి చూపించారు. అలాగే పవన్ కళ్యాణ్ కాటమరాయుడు, అజ్ఙాతవాసిలకంటే జగన్ పాదయాత్ర గురించిన వివరాలు తెలుసుకోవడానికే ఎక్కువ మంది గూగుల్‌లో సెర్చ్ చేశారు.

గూగుల్ ట్రెండ్స్‌ని పరిశీలిస్తే జగన్‌పై పచ్చ బ్యాచ్ చేసిన అవినీతి విష ప్రచారం కూడా జగన్ పాదయాత్ర దెబ్బకు కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. పాదయాత్ర ముందు వరకూ కూడా జగన్ అవినీతి, బెంగుళూరులో జగన్ ప్యాలెస్‌లు లాంటి ఊహాజనిత విషయాల గురించి నెటిజనులు సెర్చ్ చేశారు. అయితే పాదయాత్ర మొదలైన తర్వాత మాత్రం జగన్ గురించి ప్రముఖంగా సెర్చ్ చేసిన 25 విషయాల్లో 22 విషయాలు పాదయాత్రకు సంబంధించినవే ఉండడం గమనార్హం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే గత సంవత్సర కాలంలో చంద్రబాబుకు సంబంధించిన విషయాలకంటే కూడా జగన్‌కి సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవడానికే నెటిజనులు ప్రాధాన్యతనిచ్చారు. ఈ విషయంలో జగన్‌తో పోల్చుకుంటే చంద్రబాబు బాగా వెనకపడిపోయాడు. జగన్ పాదయాత్ర ప్రభావం ఏమీ లేదు అని బుకాయిస్తున్న టిడిపి జనాలకు ఈ గూగుల్ వివరాలు షాక్ ఇవ్వడం ఖాయం. గూగుల్ సెర్చ్‌లో టెక్నో సిఎంని అని చెప్పుకుంటూ స్పెషల్ ఫ్లైట్స్‌లో దేశాలు తిరుగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే ప్రతిపక్ష నేత అయిన జగన్ గురించి ఎక్కువగా చర్చ జరగడం, జగన్ పాదయాత్ర గురించి తెలుసుకోవడానికే నెటిజనులు ఎక్కువ ఆసక్తి చూపడం విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలను కూడా నెటిజనులు పెద్దగా పట్టించుకోలేదు. అయితే మహేష్ కత్తి వర్సెస్ పవన్ కళ్యాణ్ ఇష్యూ మాత్రం చాలా మందికి ఆసక్తి కలిగించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -