Thursday, May 16, 2024
- Advertisement -

సారీ నేను త‌ప్పుచేశా.. ఇక క్రికెట్ ఆడ‌లేను

- Advertisement -

ద‌క్షాణిఫ్రికా జ‌ట్టుతో మార్చి 24వ తేదీన జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బాల్‌ టాంపరింగ్‌కి పాల్పడిన ఘ‌ట‌న ఆస్ట్రేలియా దేశానికి, ఆ దేశ క్రికెట్ జ‌ట్టు మ‌నుగ‌డ సాగించే ప‌రిస్థితి లేదు. దీన్ని ఈ ప‌రిణామాన్ని అంత‌ర్జాతీయంగా అంద‌రూ ఖండిస్తూ వ‌స్తున్నారు. టాంప‌రింగ్‌కు పాల్ప‌డ‌డంతో ఏడాదిపాటు నిషేధానికి ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్ గుర‌య్యాడు. అయితే తొలిసారి మీడియాతో వార్న‌ర్ మాట్లాడాడు. ఈ సంద‌ర్భంగా క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. నేను త‌ప్పు చేశా.. స‌రిదిద్దుకోలేని త‌ప్పు చేశా అంటూ ప్రజలకు క్షమాపణలు కోరాడు.

తప్పు చేశాననే బాధ, దాన్ని ఎన్నటికీ దిద్దుకోలేననే భావ‌న‌తో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్‌ వార్నర్‌ను తాను ఇకపై క్రికెట్ ఆడ‌క‌పోవ‌చ్చ‌ని ప‌రోక్షంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. తన తప్పుకు శిక్షగా జీవితంలో ఆస్ట్రేలియా తరఫున క్రికెట్‌ ఆడనని (మార్చి31) డేవిడ్ వార్నర్‌ ప్రకటించాడు. ఆస్ట్రేలియా ప్రజలు, క్రికెట్‌ అభిమానులను నేను క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. త‌న‌పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేశానని, బాల్‌ టాంపరింగ్ ఆస్ట్రేలియా ప్రతిష్ఠ‌ను దిగజార్చిందని అభిప్రాయ‌ప‌డ్డారు. త‌నను క్షమించండని కోరాడు.

క్రికెట్‌ ద్వారా ఆస్ట్రేలియాకు గొప్ప పేరు తేవాలని కోరుకున్నానని, అయితే నేను తీసుకున్న నిర్ణయం పూర్తిగా ప్రతికూల ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. ఇది త‌న‌ను జీవితకాలం బాధిస్తూనే ఉంటుందని, నాపై మీరు చూపించిన అభిమానాన్ని, గౌరవాన్ని భవిష్యత్తులో తిరిగి పొందుతానన్న నమ్మకం ఉందని వార్నర్ ఆశాభావం వ్య‌క్తం చేశాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -