Sunday, April 28, 2024
- Advertisement -

T20 WORLDCUP 2022 : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. కివీస్ బోణి !

- Advertisement -

ఎట్టకేలకు టి20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి. సూపర్ 12 మొదటి మ్యాచ్ లో భాగంగా గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ జట్లు పోటీ పడ్డాయి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై న్యూజిలాండ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదట టాస్ ఒడి బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్ ( 16 బంతుల్లో 42 పరుగులు ; 5 ఫోర్లు, 3 సిక్సులు ), డేవాన్ కాన్వే ( 58 బంతుల్లో 92 పరుగులు : 7 ఫోర్లు, 2 సిక్సులు ) మెరుపులు మెరిపించడంతో ఆసీస్ ముందు భారీ స్కోర్ నిలిపింది న్యూజిలాండ్. .

ఇక 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ ఏ దశలోనూ లక్ష్యాన్ని చేదించేందుకు ముందుకు సాగలేదు. కివీస్ బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఆరోన్ ఫించ్ ( 13 ), డేవిడ్ వార్నర్ ( 5) , మిచెల్ మార్ష్ ( 16 ), స్టోయినెస్ ( 7 ) ఇలా అందరూ తక్కువ స్కోర్ కె వెనుదిరిగారు. మ్యాక్స్ వెల్ ( 28 ) ఒక్కడే కాస్త ఆదుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. దీంతో 17 ఓవర్లలో 111 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ గా నిలిచింది. ఇక న్యూజిలాండ్ బౌలర్లలో శాంటర్న్, సౌథి చెరో మూడు వికెట్లు, బౌల్ట్ 2 వికెట్లు తీసి ఆసీస్ పాతనాన్ని శాసించారు. ఫలితంగా 89 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై న్యూజిలాండ్ ఘనవిజయాన్ని సొంతం చేసుకొని సూపర్ 12 లో బోణి కొట్టింది.

ఇవి కూడా చదవండి

కోహ్లీ రిటైర్మెంట్ కు సమయం వచ్చిందా ?

సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే.. సచిన్ క్లారిటీ ?

సూర్య చాలా డేంజర్.. జాగ్రత్త గురూ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -