Tuesday, May 21, 2024
- Advertisement -

బాల్ ట్యాంప‌రింగ్‌పై స్పందించిన కెప్టెన్ స్మిత్‌….

- Advertisement -

ఆస్ట్రేలియా క్రికెట్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్క‌కున్న సంగ‌తి తెలిసిందే. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన మూడో వన్డేలో స్మిత్‌ బంతిని టాంపరింగ్‌ చేస్తూ దొరికిపోయాడు. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చేసే సమయంలో బంతి అందుకున్న స్మిత్‌ తన పెదవులకు ఉన్న లిప్‌ బామ్‌ను బంతికి పూశాడు.

అయితే త‌న‌పై బాల్ ట్యాంప‌రింగ్ ఆరోప‌న‌లు రావ‌డంపై స్మిత్ ఘాటుగా స్పందించారు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ వన్డేలో 303 పరుగుల లక్ష్యఛేదనకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 286/6కే పరిమితమై 16 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బంతి మెరవడానికి ఫీల్డింగ్ సమయంలో స్టీవ్ స్మిత్ లిప్‌బామ్ పూశాడంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మ్యాచ్ అనంతరం స్మిత్ మీడియాతో మాట్లాడుతూ.. తనపై అకారణంగా నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘బంతిపై నేను ఉమ్మి మాత్రమే వేసి శుభ్రం చేశాను. కానీ.. చాలా మంది నేను లిప్‌బామ్ రాశానని ఆరోపిస్తున్నారు. ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ్యాచ్ సమయంలో నేను పెదవులకి ఏమీ రాయలేదు. సాధారణంగా బంతిని ఎలా శుభ్రం చేస్తామో అలానే చేశాను’ అని స్మిత్ వివరించాడు. ఐదు టెస్టుల యాషెస్ సిరీస్‌‌లో ఇంగ్లాండ్‌ని క్లీన్‌స్వీస్ చేసిన ఆస్ట్రేలియా.. తాజాగా వరుసగా మూడు వన్డేల్లోనూ ఓడిపోయి సిరీస్‌ని చేజార్చుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -