Wednesday, May 1, 2024
- Advertisement -

టీమిండియా పై బెబ్బకు బెబ్బ తీసిన న్యూజిలాండ్!

- Advertisement -

న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా ఆ దేశ జట్టుతో మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడింది టీమిండియా. అయితే టి20 సిరీస్ ను భారత్ కైవసం చేసుకోగా, వన్డే సిరీస్ ను న్యూజిలాండ్ సొంతం చేసుకుంది. కాగా వన్డే సిరీస్ పై మొదటి నుంచి కూడా వర్షం గట్టిగానే ప్రభావం చూపింది. తొలి వన్డేలో టీమిండియాపై కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా, రెండవ వన్డే వర్షార్పణం అయింది. దాంతో సిరీస్ లో 1-0 తేడాతో కివీస్ ఆధిక్యంలో నిలిచింది. ఇక నేడు జరిగిన మూడవ వన్డే పై కూడా వర్షం ప్రభావం చూపింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 47.3 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. అనంతరం లక్ష్య చెదనకు దిగిన కివీస్.. వికెట్ నష్టానికి 104 పరుగులు చేసింది. .

ఆ తరువాత నిర్విరామంగా వర్షం పడడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. ఫలితంగా మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను కివీస్ కైవసం చేసుకుంది. ఇక మొదట జరిగిన టి20 సిరీస్ లో కూడా వర్షం కారణంగా సిరీస్ ను సొంతం చేసుకుంది టీమిండియా. ఇప్పుడు అదే వర్షం కివీస్ కు ఫేవర్ గా నిలవడంతో వన్డే సిరీస్ న్యూజిలాండ్ జట్టు సొంతం చేసుకుంది. కాగా ఈ సిరీస్ తరువాత భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో బంగ్లా జట్టుతో మూడు వన్డేలు రెండు టెస్ట్ మ్యాచ్ లు అడనుంది టీమిండియా. ఇక న్యూజిలాండ్ పర్యటనలో విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే‌ఎల్ రాహుల్ బంగ్లాదేశ్ పర్యటనలో తిరిగి జట్టులోకి రానున్నారు. కాగా ఈ పర్యటన టీమిండియాకు చాలా కీలకం అనే చెప్పాలి. ఎందుకంటే వచ్చే ఏడాది భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి. అందుకు గాను బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ ద్వారా జట్టు కూర్పు పై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు సెలక్టర్లు. మరి బంగ్లాదేశ్ పర్యటనలో ఎవరెవరు ఆటగాళ్లు స్థానం సంపాదించుకుంటారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -