తనను కొంతమంది బెదిరిస్తున్నారని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, టీం ఇండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి సస్పెన్షన్‌కు గరైన కొందరు తనను బెదిరిస్తున్నారని ఫిర్యాదు ఫిర్యాదులో పేర్నొన్నాడు. జాన్ మనోన్, విజయానంద్, నరేష్ శర్మలు జింఖానా గ్రౌండ్‌లోని హెచ్‌సీఏ కార్యాలయానికి వచ్చి అక్కడ ఉంటే కొంత మంది సిబ్బందిని కూడా ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
కాగా అజరుద్దీన్ గతంలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో భారత జట్టులోంచి స్థానం కోల్పోయాడు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి ఉత్తర ప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. ప్రస్తుతం ఆయన హెచ్‌సీఏ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Also Read:
భారత క్రికెట్ ను తలదించుకునేలా చేయకండి
కాంగ్రెస్ పార్టీలో ‘పద్మ’పంచాయతీ
ఇక మత్తు వదలాల్సిందే.. సర్కారు కీలక నిర్ణయం