- Advertisement -

కాంగ్రెస్ పార్టీలో ‘పద్మ’పంచాయతీ

- Advertisement -

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశంలోని భిన్న రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కూడా ఉండడం విశేషం. గత సాంప్రదాయాలకు భిన్నంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతకు ఈసారి పద్మ భూషణ్ ను ప్రకటించింది.

దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి . పార్టీలో తిరుగుబాటు నేతగా ఇటీవల పేరుపొందిన సీనియర్ నేత కపిల్ సిబల్ ఆజాద్ ను కాంగ్రెస్ గుర్తించకున్నా కనీసం బీజేపీ అయినా గుర్తించిందని హైకమాండ్ పై వ్యంగ్య బాణాలు విసిరారు. బీజేపీ అయినా కనీసం ఆయన సేవలు గుర్తించడం శుభపరిణామం అని అన్నారు. కాగా పద్మ అవార్డును తిరస్కరించిన పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్యను ఆజాద్ ఆదర్శంగా తీసుకోవాలని మరో సీనియన్ నేత జైరా రమేశ్ సూచించారు.

శశిథరూర్ మాత్రం నర్మగర్భంగా ఆజాద్ కు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు ప్రతిపక్షం అయినా కూడా ఆజాద్ చేసిన సేవలను గుర్తించిందని అంటుంటగా.. మరి కొందరు అవార్డును ఆజాద్ తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. దీనిపై పార్టీలోని నేతలు రెండు గ్రూపులుగా విడిపోయారు. కాంగ్రెస్ కు చెందిన అసంత్రుప్త నేతకు పద్మ అవార్డును ప్రకటించడం ద్వారా ఆపార్టీలో బీజేపీ ఇరకాటంలో పడేసినట్టు అయిందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఇక మత్తు వదలాల్సిందే.. సర్కారు కీలక నిర్ణయం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -