Friday, April 19, 2024
- Advertisement -

భారత క్రికెట్ ను తలదించుకునేలా చేయకండి

- Advertisement -

భారత్ క్రికెట్ ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లోపేలవ ప్రదర్శన చేసింది. దీంతో సఫారీలతో జరిగినఐదు మ్యాచులలో నాలుగింటిలో టీం ఇండియా ఓటమి పాలైంది. దీంతో భారత క్రికెట్ లోని అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి, బీసీసీఐ పెద్దల నిర్వాకంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని చర్చించుకుంటున్నారు.

బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలి, విరాట్ కోహ్లిల మధ్య విభేదాల నేపథ్యంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కొందరు మాజీలు రంగంలోకి దిగారు. దీనిపై లెజెండరీ క్రికెటర్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. విరాట్ కోహ్లి, గంగూలీలు వ్యక్తిగత ప్రెస్టేజ్ ను విడిచిపెట్టాలని సూచించాడు.

ఇద్దరు పరస్పరం మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. ఇరువురు ఒక సారి ఫోన్ ఎత్తి మాట్లాడుకోవాలని చెప్పాడు. భారత్ క్రికెట్ ను ప్రపంచంలో తలదించుకునేలా చేయవద్దని హితవు పలికాడు. కాగా కోహ్లికి బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీతో కొంతకాలంగా పొసగడం లేదు . అందుకే కోహ్లి అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు.

Also Read

మా ప్రైవసీని గౌరవించండి

టీం ఇండియాకు భారీ ఫైన్

ఇండియన్ క్రికెట్ లో ముసలం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -