Thursday, May 16, 2024
- Advertisement -

స్టీవ్ స్మిత్ గుండెను ట‌చ్ చేసిన స‌ఫారీ కెప్టెన్ డూప్లెసిస్‌…

- Advertisement -

క్రికెట్ ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపింది బాల్ ట్యాంపరింగ్ వివాదం. దీంతో దీనికి పాల్ప‌డిన ఆస్ట్రేలియా కెప్టెన్‌, వైస్ కెప్టెన్‌ల‌పై ఏడాది పాటు నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా. బాల్ ట్యాంప‌రింగ్ పాల్ప‌డ‌టం త‌ప్ప‌ని ఈ మాజీ కెప్టెన్ స్మిత్ క్ష‌మాప‌న‌లు చెప్పారు. ఈ సందర్భంగా తన తప్పుకు ప్రాయశ్చిత్తం వ్యక్తం చేస్తూ స్మిత్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. దీంతో స్మిత్‌కు సానుభూతి వెల్లువెత్తుతోంది.

తాజాగా స‌ఫారీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ స్పందించాడు. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై ఏడాదిపాటు నిషేధం విధించడం కఠిన చర్యగా అభిప్రాయపడ్డాడు. వివాదం తర్వాత స్మిత్‌కు మనోధైర్యాన్ని ఇచ్చేలా ఇప్పుడే మెసేజ్ పెట్టానని చెప్పాడు.

నా మనసు అంతరాల్లో స్మిత్ గురించి తీవ్ర వేదనకు గురయ్యాను. అందుకే అతడికి మెసేజ్ పెట్టానని గతంలో రెండుసార్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి, ఫైన్‌తో తప్పించుకున్న డుప్లెసిస్ చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవర్నీ చూడాలనుకోవడం లేదని సఫారీ కెప్టెన్ తెలిపాడు.

రానున్న రోజులు స్మిత్‌కు చాలా కష్టంగా ఉంటాయి, అతడు ధైర్యంగా ఉండాలని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఉన్నత విలువల కోసం స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం విధించింది. కానీ ఆ ముగ్గురిపై తీసుకున్న చర్యలు కఠినంగా ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -